Star cricketer
-
విరాట్ కోహ్లీ (స్టార్ క్రికెటర్) రాయని డైరీ
ఆట ఎన్ని పొరపాట్లనైనా క్షమించేస్తుంది. మళ్లీ మళ్లీ ఆడేందుకు అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ పెళ్లయిన వాడి జీవితంలో ఒక్క పొరపాటుకైనా క్షమాపణ ఉండదు. పోన్లే పాపం, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని జీవితం అనుకోదు. జీవితం దయ తలచినా, జీవిత భాగస్వామి క్షమాభిక్ష పెట్టదు!ఎవరో తెలియనైనా తెలియని ఒక అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పొరపాటున లైక్ కొట్టినందుకు అనుష్క నా వైపు చూడటమే మానేసింది! తెలియని అమ్మాయికి, తెలియకుండా లైక్ కొట్టడంలో ఉండేది పొరపాటే కానీ మరొకటి మరొకటి ఎందుకవుతుంది?! నా నెత్తి మీద ఏ దేవతో ఆ క్షణంలో కూర్చొని ఉండాలి. ఊరికే ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి కనిపించింది. ప్రింటెడ్ ర్యాప్ స్కర్ట్, గ్రీన్ టాప్. నా అంతట నేనే ఆ అమ్మాయి ఫొటోకి లైక్ కొట్టానా, లేక లైక్ తనంతటదే వెళ్లి ఆ అమ్మాయి ఫొటో కింద పడిందా తెలియటం లేదు. అసలు ఆ అమ్మాయే గుర్తు లేదు.అమ్మాయి వేసుకున్న ర్యాప్ స్కర్ట్, గ్రీన్ టాప్ గుర్తుండీ, అమ్మాయి గుర్తు లేక పోవటం అనేది ఉంటుందా? ఉండొచ్చేమో! నా నెత్తి మీద దేవతకు ఎంత మహిమ ఉందంటే... సరిగ్గా అనుష్క పుట్టిన రోజుకు మర్నాడే ఇలా జరిగింది. తనదొక రేర్ ఫోటోను వెతికి తీసి, ‘యూ ఆర్ మై లవ్’ అని కవిత్వం రాసి, తనకు బర్త్ డే విషెస్ చెప్పిన కొద్ది గంటలకే... ఆ ఎవరో తెలియని అమ్మాయికి నేను లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లను క్రికెట్ అభిమానులు గొప్పగా సెలబ్రేట్ చేశారు.ఆ సెలబ్రేషన్ అనుష్క వరకు వచ్చింది. ‘‘ప్రేమించుకుని కదా పెళ్లి చేసుకున్నాం... ఈ తిక్క వేషాలేంటి?’’ అని అనుష్క నన్ను డైరెక్ట్‌గా అడిగినా బాగుండేది. తన ముందు ఆరార్లు ముప్పై ఆరు గుంజీళ్లు తీసేవాడిని.పాపభూయిష్ఠమైన నా పొరపాటుకు నివృత్తి, నిష్కృతి రెండూ లభించేవి. తనకు సిక్సర్లంటే ఇష్టం. అందుకే అన్ని గుంజీళ్లు.సిక్సర్లంటే తనకు ఇష్టమే కానీ, నేనంటే ఉండేంత ఇష్టమేమీ కాదు. మిడ్ ఓవర్స్‌లో స్పిన్ బాల్స్‌ని ఫేస్ చెయ్యలేక ఔట్ అయి బయటికి వచ్చిన ప్రతిసారీ... ‘‘నాకోసం అదే పనిగా సిక్సర్లు కొట్టేయనవసరం లేదు’’ అని నవ్వేసేది. ఇప్పుడు తనే నా మీద బౌన్సర్లు వేస్తోంది... తన మౌనంతో!అనుష్క మాట్లాడటం లేదు. వామిక నిద్రపోతోంది. అకాయ్‌కి మాటలు రావటానికి ఇంకా టైమ్ పడుతుంది. అకాయ్ ఒక్కడే ఇంట్లో ఇప్పుడు నా మేల్ ఫ్రెండ్. వాడు నా చెయ్యి పట్టుకుని నడవటానికి, బ్యాట్ పట్టుకుని నాతో ఆడటానికి, బైక్ మీద కాలేజీకి వెళ్లి రావటానికి, మళ్లీ ఎప్పుడైనా అనుష్క నాతో మాట్లాడటం మానేసినప్పుడు.. ‘‘ఏంటి డాడీ అలా ఉన్నారు?’’ అని నన్ను అడగటానికి వాడికి టైమ్ పడుతుంది.రెస్టారెంట్ నుంచి రాగానే అనుష్క నేరుగా పిల్లల గదిలోకి వెళ్లిపోయింది. రెస్టారెంట్ ముందు కార్లోంచి దిగుతున్నప్పుడు ఎప్పటిలా తనకు చెయ్యందించినా, తను నా చెయ్యందుకోలేదు. కనీసం నాకోసం ఆగనైనా ఆగకుండా నన్ను దాటుకుని, నడుచుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోయింది.ఒక్క లైక్ జీవితాన్ని ఎంత ఛిద్రం చేసింది!బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాను. సిటీ అంతా వెలిగిపోతోంది. నాలో మాత్రం చీకటి. ఎందుకు నేనలా చేశాను?!ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకుమంటున్నాయి. ఒక చుక్క అమితాబ్ బచ్చన్. ఒక చుక్క బిల్ క్లింటన్. ఒక చుక్క బరాక్ ఒబామా. ఒక చుక్క బిల్ గేట్స్.ఆ చుక్కల్లో నేనూ ఒక చుక్కనయ్యానా? అనుష్కకు తీవ్రమైన ఆవేదన మిగిల్చినందుకు! రాత్రి రెండు దాటేసినట్లుంది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ పిల్లల గదిలోకి వెళ్లాను. వామిక నిద్రపోతోంది. అకాయ్ నిద్ర పోతున్నాడు. అనుష్క నిద్ర పోతున్నట్లుగా ఉంది. తను పడుకుని ఉన్న వైపు వెళ్లి, తన తల పక్కనే నేల పైన మోకాలి మీద కూర్చున్నాను. -
శతకాల వీరుడికి... సువర్ణావకాశం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన స్టార్ క్రికెటర్ నంబళ్ల సుశాంత్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. గత రెండు నెలలగా జరిగిన ఏసీఏ అంతర్‌జోనల్ క్రికెట్ టోర్నీల్లో భీకర ఫామ్‌ను కొన సాగిస్తూ సెంచరీల మోత మోగించిన సుశాంత్ బీసీసీఐ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఏసీఏ ఆంధ్రా అండర్–19 పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన ఆంధ్రా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్‌గానే సుశాంత్‌కు ఛాన్స్ లభించింది.బీసీసీఐ ఆధ్వర్యంలో మెగా టోర్నీ..గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా బీసీసీఐ ఆధ్వర్యంలో రిలయన్స్ సంస్థ సహకారంతో ఈనెల 24 నుంచి ఆలిండియా అంతర్రాష్ట్ర అండర్–19 పురుషుల ఇన్విటేషన్ లీగ్ అండ్ నాకౌట్ టెస్ట్(త్రీడేస్ మ్యాచ్‌ల) టోర్నమెంట్ 2024–25 జరగనుంది. యువ టాలెంట్‌ను వెతికేందుకు బీసీసీఐ మెగా టోర్నీని నిర్వహిస్తుంది. ఈ మూడో సీజన్ మెగా టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు బరోడా, బెంగాల్, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మద్యప్రదేశ్, ముంబాయ్, పంజా బ్, సౌరాష్ట్ర రాష్ట్రాల జట్ల ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈనెల 24 నుంచి ఈ పోటీలు మొదలుకానున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఆంధ్రా జట్టుకు శ్రీకాకుళం నుంచి ఒకే ఒక్కడు నంబళ్ల సుశాంత్ ఎంపికయ్యాడు.అత్యద్భుతమైన ఆటతీరుతో రాణింపు..గత కొన్నేళ్ల నుంచి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సుశాంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వైఎస్సార్ కడప జిల్లాలో కేఓఆర్ఎం కాలేజ్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఏసీఏ అంతర్‌జోనల్ పురుషుల అండర్–19 త్రీడేస్(టెస్ట్) మ్యాచ్‌ల టోర్నీలో శ్రీకాకుళం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నంబళ్ల సుశాంత్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలి ముగిసిన పరిమిత ఓవర్ల వన్డే టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 341 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా త్రీడేస్ టోర్నీలోనూ సెంచరీల మోత మో గిస్తున్నాడు. అటు ఏసీఏ ఆంధ్రా అండర్–19జట్టుతోపాటు ఇటు ఆంధ్రా రంజీ జట్టుకు ఎంపికయ్యేందుకు బలమైన బాటలు వేసుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఐదు సెంచరీలతో కదంతొక్కాడు. ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.తండ్రి ప్రోత్సాహంతో..సుశాంత్ స్వస్థలం జిల్లాలోని టెక్కలి పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ. ప్రస్తుతం శ్రీకాకుళంలోనే నివాసం ఉంటున్నారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి నంబళ్ల జగదీష్ శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, తల్లి అర్చన గృహిణి. తండ్రి దగ్గరుండి నిరంతరం ప్రోత్సహిస్తుండటంతో సుశాంత్ అదరగొట్టేలా ప్రతిభను చూపిస్తున్నాడు.క్రికెట్ సంఘం అభినందన..ప్రతిష్టాత్మక ఆలిండియా అంతర్రాష్ట్ర మెగా క్రికెట్ టోర్నీకి నంబళ్ల సుశాంత్ ఎంపికపై క్రికెట్ సంఘ జిల్లా అధ్యక్షుడు పీఎల్ఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజ షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ రవికుమార్ తదితరులు అభినందించారు. యువ క్రీడాకారుడి రాణింపుపై తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. -
స్టార్ క్రికెటర్ తో అనుష్క శెట్టి పెళ్లి ?
-
త్వరలోనే అనుష్క శెట్టి పెళ్లి?
సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ రావడం సర్వ సాధారణం. బాలీవుడ్ మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఇటీవల ఎక్కువయ్యాయి. డేటింగ్, పెళ్లి, విడాకులు అంటూ సినీ తారలపై మనం తరచు వార్తలు వింటుంటాం. స్టార్ నటీనటుల విషయంలో ఇవీ కాస్తా ఎక్కువగానే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అని అందరికీ తెలుసు. కెరీర్ ప్రధానంగా సాగే ఈ రంగంలో చాలామంది వయసు పెరుగుతునప్పటికీ పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ల విషయంలో తరచుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల రష్మిక- విజయ్ ఎంగేజ్మెంట్ అంటూ పెద్దఎత్తున రూమర్స్ వచ్చాయి. అలాంటిదేమీ లేదంటూ విజయ్ టీం క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న టాక్ తెగ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో స్వీటీగా తన పేరును ముద్రించుకున్న హీరోయిన్ అనుష్క. విక్రమార్కుడు నుంచి బాహుబలి దాగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పించింది. అరుంధతి చిత్రంతో జేజమ్మగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ద్వారా పలకరించింది. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపించి అలరించింది. అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంలో గతంలో చాలాసార్లు ఆమెపై రూమర్స్ కూడా వచ్చాయి. అవీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయంపై చర్చ మొదలైంది. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్‌తో రిలేషన్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో ఏకంగా ఓ స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతే కాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కాగా.. గతంలో అనుష్క పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లిపై నాకు నమ్మకముంది. వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క పెళ్లిపై మరోసారి వార్తలు రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్
-
స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచ్చానేను ఆచూకీ కనుగొనడం కోసం నేపాల్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. నేపాల్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ లమిచ్చానేపై నేపాల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది. కాగా అప్పటికే సందీప్ లమిచ్చానే కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆడేందుకు జమైకా వెళ్లాడు. కాగా సీపీఎల్‌లో జమైకా తలైవాస్‌కు ఆడుతున్న సందీప్ లమిచ్చానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటినుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్ పోలీసులు సందీప్ అరెస్ట్ విషయంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. అతని ఆచూకీ కోసం సభ్య దేశాల సహకారం కోరుతూ ఇంటర్‌పోల్ ఆదివారం అతనిపై "డిఫ్యూజన్" నోటీసు జారీ చేసిందని నేపాలీ పోలీసు ప్రతినిధి టెక్ ప్రసాద్ రాయ్ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇంటర్‌పోల్ సహకారం వల్ల సందీప్ లమిచ్చానే అరెస్ట్ చేయగలమన్న నమ్మకం ఉంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని విచారిస్తే గానీ అసలు నిజం బయటపడదు. అని నేపాల్ పోలీసు ప్రతినిధి తెలిపాడు. అయితే లమిచ్చానే మాత్రం..'' తాను ఏ తప్పు చేయలేదని.. త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి నాపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని నిరూపించుకుంటానంటూ'' ఆదివారం సోషల్ మీడియాలో పేర్కొనడం గమనార్హం. కాగా సందీప్ లమిచ్చానే నేపాల్ జట్టు తరపున స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సందీప్ 30 వన్డేల్లో 69 వికెట్లె, 44 టి20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సందీప్ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. కాగా గతేడాది చివర్లో జరిగిన వేలంలో సందీప్ లమిచ్చానే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఇంకో విషయమేంటంటే.. గతేడాది నేపాల్‌లో 2,300 రేప్ కేసులు నమోదైనట్లు నేపాల్ స్థానిక సంస్థ ఒకటి తన రిపోర్టులో పేర్కొంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్.. గింగిరాలు తిరుగుతూ గోల్ కొట్టిన దిగ్గజం -
గేల్‌కు వీడ్కోలు టెస్టు లేదు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఒకే ఒక్క టెస్టు... సొంతగడ్డపై తన చివరి టెస్టు మ్యాచ్ ఆడి రిటైర్ అవుతానని ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ ఆశలను ఆ దేశ సెలక్టర్లు తుంచేశారు. భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో గేల్‌కు చోటు దక్కలేదు. ఈ నెల 30 నుంచి జమైకాలోని కింగ్‌స్టన్‌లో భారత్, విండీస్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆడి నిష్క్రమించాలనే కోరికను గేల్ ప్రపంచ కప్ సమయంలో వెలిబుచ్చాడు. అయితే ఐదేళ్ల క్రితం 2014లో తన చివరి టెస్టు ఆడిన గేల్‌ను ఇప్పుడు టెస్టు మ్యాచ్ కోసం పరిగణనలోకి తీసుకోవడం సరైంది కాదని రాబర్ట్ హేన్స్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావించింది. ‘గేల్ వన్డేలు, టి20ల్లో కొనసాగుతానంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అతను ఆ ఫార్మాట్లలో ఇప్పటికీ విధ్వంసక బ్యాట్స్‌మన్. కానీ టెస్టు ఆడతానంటే మాత్రం కుదరదు. అతను ఐదేళ్లుగా టెస్టు బరిలోకి దిగలేదు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ కోసం తీసుకురావడం అంటే మళ్లీ వెనక్కి వెళ్లినట్లే. యువ ఆటగాళ్లకు ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుంది’ అని దిగ్గజ పేసర్ కర్ట్లీ ఆంబ్రోస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సెలక్టర్లను ప్రభావితం చేసి ఉండవచ్చు. విండీస్ తరఫున 103 టెస్టులు ఆడిన గేల్ 42.18 సగటుతో 7,214 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉండగా... అతని అత్యధిక స్కోరు 333 కావడం విశేషం. అల్జారీ జోసెఫ్ ఔట్! ఇంగ్లండ్‌తో తమ ఆఖరి టెస్టు సిరీస్ ఆడిన జట్టులో రెండు మార్పులతో వెస్టిండీస్ తమ టీమ్‌ను ప్రకటించింది. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఆడుతూ గాయపడిన అల్జారీ జోసెఫ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతడిని ఎంపిక చేయలేదు. లెఫ్టార్మ్ స్పిన్నర్ జోమెల్ వారికాన్ మాత్రం జట్టులో చోటు కోల్పోయాడు. వీరిద్దరి స్థానంలో విండీస్ ఒకే మార్పు చేసింది. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ రహ్కీమ్ కార్న్‌వాల్‌ను తొలిసారి జట్టులోకి తీసుకుంది. తాజాగా భారత్‌తో ముగిసిన ‘ఎ’ సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన కార్న్‌వాల్ రెండు అర్ధసెంచరీలు చేసి 4 వికెట్లు పడగొట్టాడు. అటాకింగ్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల సామర్థ్యం వల్ల కార్న్‌వాల్‌కు అవకాశం కల్పించినట్లు విండీస్ సెలక్టర్లు చెప్పారు. భారత్, విండీస్ మధ్య ఆగస్టు 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. విండీస్ టెస్టు జట్టు వివరాలు: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రేవో, షమర్ బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేజ్, రహ్కీమ్ కార్న్‌వాల్, షేన్ డౌరిచ్, షనాన్ గాబ్రియెల్, షిమ్రాన్ హెట్‌మైర్, షై హోప్, కీమో పాల్, కీమర్ రోచ్. -
స్టార్ క్రికెటర్ పొలిటికల్ ఎంట్రీ!
సమకాలీన క్రికెట్ లో విలక్షణ విధ్వంసకారుడిగా పేరు పొందిన స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. సమీప భవిష్యత్ లోనే పాకిస్థాన్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపాడు. ఇప్పటికే 'షాహిద్ అఫ్రిది ఫౌండేషన్' ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న అఫ్రిది.. ప్రజలకు మరింత సేవ చేసేందుకే పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు పేర్కొన్నాడు. లాహోర్ లోని తన నివాసం నుంచి 'బీబీసీ ఉర్దూ' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది తన మనోభావాలను వెల్లడించాడు. 'నా దృష్టిలో రాజకీయ నాయకులంటే ప్రజా సేవకులు. వారి పరమ ధర్మం ప్రజా సేవే అయి ఉండాలి. నిజానికి నేను రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజాసేవ చేయగలను. మా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలా కార్య్రమాలు అమలవుతున్నాయి. అయితే మరింత మందికి సేవచేసేందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. రాజకీయాల్లోకి వెళ్లొద్దని ఆప్త మిత్రులు కొందరు సలహా ఇచ్చారు. నేను మాత్రం భవిష్యత్ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నా' అంటూ తన ప్రణాళికను వివరించాడు అఫ్రిది. (చదవండి: ఆఫ్రిది.. నువ్వెప్పుడు?) ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాక్ తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో ఒకడైన షాహిద్ అఫ్రిది.. అధికారికంగా వన్ డే, టెస్ట్ లకు గుడ్ బై చెప్పలేదు. ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీల్లో హాంప్ షైర్ జట్టుకు ఆడుతున్నాడు. మళ్లీ జట్టులోకి ప్రవేశించే అవకాశాలు దాదాపు కనుమరుగవుతున్న నేపథ్యంలోనే పొలిటికల్ ఎంట్రీపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. -
సీజన్లో తొలి రోజు...
మొయినుద్దౌలా మ్యాచ్‌కు యువరాజ్ సాక్షి, హైదరాబాద్ : స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ బరిలోకి దిగాడు. ఉప్పల్ స్టేడియంలో ఎంఆర్ఎఫ్తో జరిగిన మ్యాచ్‌లో ఎయిరిండియా తరఫున అతను ఆడుతున్నాడు. ఈ టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న యువీ, చివరి లీగ్ మ్యాచ్‌కు వచ్చాడు. మొదటి రోజు గురువారం 2 ఓవర్లు బౌలింగ్ చేసిన యువీ 14 పరుగులిచ్చాడు. అయితే 43 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం నిరాశ కలిగించిందని యువీ ట్వీట్ చేశాడు.