shocking details
-
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. -
పాము కాటు కాదు.. భార్య నిర్వాకమే!
ప్రియుడికి తనకు మధ్యలో అడ్డుగా ఉన్నాడని భర్తను ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో కుక్కింది ఓ భార్య. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ఘోరం చోటు చేసుకుంది.రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని. రాత్రంతా ఆ పాము అలాగే పక్కలోనే ఉండిపోయింది. ఉదయం దానిని తొలగించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దీంతో ‘పాపం’ అనుకున్నారంతా. అయితే బుధవారం సాయంత్రం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది.మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని పాము కాటేయడంతో మరణించాడని ప్రచారం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.రవితకు అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్జీత్తో కలిసి భర్తను కడతేర్చాలని రవిత స్కెచ్ వేసింది. అమర్జీత్ సాయంతో అమిత్ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై రోజుకి రూ.వెయ్యి ఖర్చు అద్దెతో తెచ్చిన ఓ పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికుల సాయంతో పాములు పట్టేవాడిని తెచ్చి దానిని తొలగించింది. దీంతో జనం కూడా పాము కాటు వల్లే అతను చనిపోయాడని నమ్మి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రవితతో పాటు అమర్జీత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె. -
భూకంపం వచ్చిందన్నట్లుగా SLBC టన్నెల్ ప్రమాదం!
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదం భారీ స్థాయిలోనే జరిగిందని తెలుస్తోంది. టన్నెల్ ప్రమాదంపై మంత్రులు ఉత్తమ్, జూపల్లి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ భేటీలో Tunnel Collapse ప్రమాదం జరిగిన తీరును అధికారులు వారికి వివరించారు.నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట(Domalapenta) సమీపంలో.. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద పైకప్పు ఒరిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన దృశ్యం.. భూకంపం వచ్చినట్లుగా ఉందని అధికారులు మంత్రులతో అన్నారు. భారీ శబ్ధంతో ప్రమాదం జరిగిందని, ఆ తీవ్రత వల్ల వెయ్యి క్యూబిక్ మీటర్లు రాళ్లు, మట్టి పేరుకుపోయాయి. దీంతో ఆందోళన చెందిన కార్మికులు, ఇంజినీర్లు మిషనరీ వదిలేసి బయటకు పరుగులు తీశారు. 150 మీటర్ల వరకు ప్రమాద తీవ్రత కనిపించింది అని అధికారులు తెలిపారు. ఇక సహాయక చర్యలపై మంత్రులు ఆరా తీశారు. ఉదయం నుంచి 40 మందిని టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని, గాయపడినవాళ్లను ఆస్పత్రికి తరలించామని వివరించారు. మరికొందరిని బయటకు తేవాల్సి ఉందని చెప్పారు. టన్నెల్లో భారీగా నీరు చేరిపోవడంతో.. సింగరేణి నుంచి సహాయక బృందాన్ని రప్పించినట్లు వివరించారు. అయితే ఇంకా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయినట్లు నిర్ధారణ అయ్యింది . అందులో నలుగురు కూలీలు కాగా, మిగతా వారు అధికార సిబ్బంది అని సమాచారం. ఐదేళ్ల కిందట.. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యే తిరిగి ఈ పనులను మొదలుపెట్టాలని నిర్ణయించింది. నిలిచిన పనులను మళ్లీ కొనసాగించేందుకు సన్నాహాక పనులు జరుగుతుండగా.. ఈలోపు ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.ఎస్సెల్బీసీ సొరంగ మార్గం వివరాలునల్లగొండ, పాలమూరు జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రారంభం అయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులుదివంగత నేత వైఎస్సార్ హయాంలో 2004 లో రూ. 2,200 కోట్లతో సొరంగం ప్రారంభంప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద సొరంగం పనులకు వైఎస్సార్ శంకుస్థాపనఅరవై నెలల్లో పనులు పూర్తి కావాల్సిన సొరంగంవివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న పనులుమధ్యలో వచ్చిన ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో సొరంగం ఆలస్యంశ్రీశైలం ఎడమగట్టు కాల్వపై 44 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉందిమిగతా పనుల పూర్తి కోసం ఇటీవలే నిధుల కేటాయింపు2010 నుంచి ఇప్పటి వరకు సొరంగం పూర్తి కోసం ఆరుసార్లు డెడ్ లైన్2026 జూన్ నాటికి సొరంగాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం2017 లో సొరంగం అంచనా వ్యయం రూ. 3,152.72 కోట్లు పెంపుఈమధ్యే మరోసారి రూ.4,637 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం ఇదీ చదవండి: ఎల్ఎల్బీసీ టన్నెల్లో ఉదయం 8.20కి అసలేం జరిగిందంటే.. -
వివేకా రెండో భార్య వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. లైవ్‌లో చదివి వినిపించిన యాంకర్
-
సంచలన విషయాలు చెప్పిన ప్రత్యూష ఫ్రెండ్స్
బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె సన్నిహితులు, స్నేహితులు నమ్మలేకపోతున్నారు. ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్తో ఆమెకు విబేధాలున్నాయని చెప్పారు. రాహుల్, ప్రత్యూషల అనుబంధం గురించి మీడియా సమావేశంలో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రత్యూషకు ఇటీవల ఓ ఆఫర్ ఇచ్చిన నిర్మాత వికాస్ గుప్తా మాట్లాడుతూ.. రాహుల్‌తో సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని ప్రత్యూష భావించిందని చెప్పాడు. రాహుల్ అందరిముందు ఆమెను కొట్టాడని వెల్లడించాడు. ప్రత్యూష సన్నిహితులు ఇంకా ఏం చెప్పారంటే.. రాహుల్ తనను మోసం చేశాడని ప్రత్యూష చెప్పింది - కామ్యా పంజాబీ ఆర్థిక సమస్యల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు - శశాంక్ వ్యాస్ ప్రత్యూష ఎత్తు చాలా తక్కువ. ఐదు అడుగులా రెండు అంగులాల పొడవు ఉంది. ఆమె ఎలా ఉరి వేసుకోగలదు? - కామ్యా పంజాబీ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నా. సలోని (రాహుల్ మాజీ గర్ల్ ఫ్రెండ్) తనను బెదిరించిందని మరణించడానికి ముందు రోజు ప్రత్యూష చెప్పింది - న్యాయవాది ఫాల్గుణి రాహుల్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో కలసి ప్రత్యూషను మోసం చేశాడని, చాలాసార్లు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చాలా మంది చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు రాహుల్‌ను సుదీర్ఘంగా విచారించారు. గత శుక్రవారం ముంబైలోని ప్లాట్‌లో ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.