The Paradise Movie
-
పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు
లెక్క ప్రకారం రామ్ చరణ్ పుట్టినరోజు నాడే 'పెద్ది' సినిమా (Peddi Movie) గ్లింప్స్ రిలీజ్ కావాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా తాజాగా శ్రీరామనవమి కానుకగా విడుదల చేశారు. వీడియో బాగుంది. చివరి షాట్ కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ దగ్గరే అసలు సమస్య వచ్చినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)ఎందుకంటే వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చి 27న థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్నిరోజుల క్రితం నాని 'ద ప్యారడైజ్' (The Paradise Movie) చిత్రాన్ని వచ్చే మార్చి 26న విడుదల చేస్తామని పేర్కొన్నాడు. అంటే ఈ రెండు చిత్రాల మధ్య పోటీ కన్ఫర్మ్ అయింది.ఇక్కడ చరణ్, నాని మధ్య పోటీ కాదు. మరో ఇద్దరి మధ్య కూడా ఉందని చెప్పొచ్చు. చరణ్ (Ram Charan) ఇదివరకే తండ్రి చిరంజీవితో సినిమా నిర్మించారు. నాని కూడా త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాబట్టి పెద్ది మూవీతో పోటీ పడతాడా అంటే సందేహమే అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా)ప్యారడైజ్ తీస్తుంది శ్రీకాంత్ ఓదెల కాగా.. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు. వీళ్లిద్దరూ కూడా సుకుమార్ శిష్యులే. ఒకవేళ పోటీ కచ్చితం అయితే మాత్రం సుక్క శిష్యుల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. మరోవైపు ప్యారడైజ్ కి అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా.. పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కోలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పోటీనే అనుకోవచ్చు. ఇలా ఒక్కరు కాదు ఈ రెండు చిత్రాల వల్ల ఏకంగా తలో ముగ్గురు మధ్య పోటీ అనుకోవచ్చేమో. మరి ఈ రెండింటిలో ఏది చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారనేది కూడా చూడాలి.(ఇదీ చదవండి: దెయ్యం నవ్వు హీరోయిన్.. డైరెక్టర్ విచిత్రమైన కామెంట్స్) -
త్వరలో చూస్తారు!
‘దసరా’(2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని సంతృప్తిగా లేరని, అదేవిధంగా బడ్జెట్ బాగా పెరిగిపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ గత కొద్దిరోజులుగా ఆన్లైన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్తలపై చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. ‘‘ది ప్యారడైజ్’పై ఎలాంటి అనుమానాలొద్దు. మేము అనుకున్నవిధంగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ మూవీని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నామో త్వరలోనే చూస్తారు. ఆ సమయం వరకు పుకార్లు సృష్టిస్తూ కొందరు బతికేయచ్చు. ఎందుకంటే ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తుంటాయి కదా! మా సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను చాలా దగ్గరగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. ప్రేమ, ద్వేశాన్ని రెండింటినీ తీసుకుని.. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగులో ఉండే గొప్ప చిత్రాల్లో ఒకటిగా ‘ది ప్యారడైజ్’ ఉంటుంది. సినిమాపై పుకార్లు సృష్టిస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలి. అభిమానులంతా గర్వపడే చిత్రంతో నాని మీ ముందుకు వస్తారని మాట ఇస్తున్నాం’’ అని యూనిట్ పోస్ట్ చేసింది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమేరా: ఏఓ విష్ణు, సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
టాలీవుడ్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ సినిమా 'ది ప్యారడైజ్'(The Paradise ).. పోస్టర్‌తో పాన్ ఇండియా రేంజ్లో సినీ ప్రేక్షకులను మెప్పించిన ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓటీటీ ఢీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. కేవలం గ్లింప్స్‌తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని, కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు వైరల్ అయింది. ఆపై బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోవడం వల్ల ఈ సినిమాను ఆపేస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై చిత్ర యూనిట్ గట్టిగానే రియాక్ట్ అయింది.సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు రూమర్స్ వైరల్ చేసేవారిని జోకర్స్‌తో పోలుస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'ది ప్యారడైజ్ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అనుమానాలు వద్దు. మేము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నాం. దానిని మీరందరూ కూడా త్వరలో చూస్తారు. ఆ సమయం వరకు రూమర్స్‌తో కొందరు బతికేయవచ్చు. 'గజరాజు నడుస్తూ ఉంటే..గజ్జి కుక్కలు అరుస్తాయి'. ది ప్యారడైజ్ సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను మేము చాలా దగ్గరగా చూస్తునే ఉన్నాం. ఆపై ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. మేము ప్రేమ, ద్వేశాన్ని రెండూ తీసుకుంటాము. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగు పరిశ్రమలో ఉండే గొప్ప చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ ఉంటుంది. సినిమాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.. ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్యారడైజ్ సినిమాతో నాని తిరిగొస్తాడని మాట ఇస్తున్నాం.' అని ఒక చిత్ర యూనిట్ ఒక పోస్ట్ చేసింది.హిట్ 3 టీజర్లో మోస్ట్ వయోలెంట్ ఆఫీసర్‌గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్లో ది ప్యారడైజ్‌లో కనిపంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వచ్చే సంవత్సరం మార్చి 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో ది ప్యారడైజ్ విడుదల కానుంది. To all 🤡s out there, you feed on us... because we let you do so.#TheParadise is rising in all its glory. Rest assured, it is on the right track. And you all will witness it soon.Meanwhile, keep feeding on us as much as you can. Because...'Gajaraju nadiste..Gajji kukkalu…— THE PARADISE (@TheParadiseOffl) April 2, 2025 -
హిస్టారికల్ ప్యారడైజ్
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై రూపొందుతోన్న ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. కాగా ఈ సినిమా సరిగ్గా 365 రోజుల్లో తెరపైకి రానుందని పేర్కొని, ‘వన్ ఇయర్ టు గో... ఇండియన్ సినిమా విట్నెస్ ది మ్యాడ్నెస్’ అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే విడుదలైన మా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్రిప్పింగ్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సాధించింది. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ నానీని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో చూపించనుంది. సుధాకర్ చెరుకూరి అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం, ఏఓ విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మా చిత్రం తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ సహా 8 భాషల్లో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.