Aniket
-
IPL 2025: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు భారీ షాక్..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగబోయే మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. ఆ జట్టు నయా సిక్స్ హిట్టింగ్ మెషీన్ అనికేత్ వర్మ నిన్న ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడని సమాచారం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ బౌలర్ వేసిన బంతి అనికేత్ కాలి బొటన వేలుకు బలంగా తాకిందని తెలుస్తుంది. నొప్పితో విలవిలలాడిపోయిన అనికేత్ పిచ్‌పై కుప్పకూలాడని ప్రచారం జరుగుతుంది. ప్రాక్టీస్ సాగుతుండగా అనికేత్ మైదానాన్ని వీడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. అనికేత్ గాయం విషయమై సన్‌రైజర్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా, ప్రస్తుత సీజన్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల అనికేత్.. తొలి మ్యాచ్ నుంచే మెప్పిస్తూ వచ్చాడు. ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే (రాజస్థాన్ రాయల్స్‌పై) సిక్సర్‌గా మలిచిన అనికేత్.. అతి తక్కువ వ్యవధిలోనే భారీ హిట్టర్‌గా పేరు గడించాడు. తన రెండో మ్యాచ్‌లో లక్నోపై 5 భారీ సిక్సర్లు బాదిన అనికేత్.. ఆతర్వాత ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మరింత చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సహచర బ్యాటర్లంతా విఫలం కాగా.. అనికేత్ ఒంటరి పోరాటం చేసి మెరుపు అర్ద సెంచరీ (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 74 పరుగులు) చేశాడు. 3 మ్యాచ్‌ల్లోనే 12 భారీ సిక్సర్లు బాదిన అనికేత్ నేడు కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమైతే సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు.కాగా, ఈ సీజన్లో అంతంతమాత్రంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్, కేకేఆర్ గత సీజన్ ఫైనల్లో చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్లో సన్‌రైజర్స్, కేకేఆర్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 18, సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటివరకు తలో మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్కో మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందాయి. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి.. ఆతర్వాత వరుసగా లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడింది. కేకేఆర్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హెదాలో బరిలోకి దిగిన ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చిత్తై, ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపొందింది. చివరిగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ మరో ఓటమిని మూటగట్టుకుంది.ఈ సీజన్లో సన్‌రైజర్స్ కేకేఆర్ కంటే పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. భారీ హైప్ కారణంగా అంచనాలను అందుకోలేకపోతుంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. -
మూడేళ్ల వయసులో తల్లి దూరం.. తండ్రి రెండో పెళ్లి.. బామ్మే అమ్మగా మారి! (ఫొటోలు)
-
సన్‌రైజర్స్ న్యూ హీరో
-
వైజాగ్‌లో అనికేత్ వర్మ విధ్వంసం.. వీడియో వైరల్
ఐపీఎల్-2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు అనికేత్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కిషన్, అభిషేక్ శర్మ, హెడ్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట అనికేత్.. తన విరోచిత బ్యాటింగ్‌తో ఎస్ఆర్హెచ్ టీమ్‌ను ఆదుకున్నాడు.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అనికేత్.. ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌ను అనికేత్ ఊతికారేశాడు. తన విధ్వసంకర బ్యాటింగ్‌తో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అనికేత్ కేవలం 34 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.హాఫ్ సెంచరీ తర్వాత కూడా తన దూకుడును వర్మ కొనసాగించాడు. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అనికేత్.. ఆ తర్వాత బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగుల ఫైటింగ్ స్కోర్ చేయగల్గింది. అతడితో క్లాసెన్(32) పరుగులతో రాణించాడు.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. కాగా అద్భుత ఇన్నింగ్స ఆడిన అనికేత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్కు మరో సరికొత్త హిట్టర్ దొరికాడని పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: అభిషేక్ శర్మ రనౌట్.. తప్పు ఎవరిది? వీడియో వైరల్ -
అనికేత్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ అనికేత్ రెడ్డి (5/72) సత్తా చాటాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 33/1తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 92 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఇనేశ్ మహజన్ (79 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకం సాధించగా... శుభమ్ అరోరా (53; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేశాడు.అంకిత్ (31), అపూర్వ్ వాలియా (37), ఆకాశ్ వశిష్ట్ (46) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు తీయగా... నిశాంత్, వరుణ్ గౌడ్లకు చెరో వికెట్ దక్కింది. దీంతో హైదరాబాద్‌కు 290 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. శనివారం ఆట ముగిసే సమయానికి హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. శుభమ్ అరోరా (16 బ్యాటింగ్), ప్రశాంత్ చోప్రా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 10 వికెట్లు ఉన్న హిమాచల్ జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 269 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 565; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (ఎల్బీ) (బి) అనికేత్ రెడ్డి 53; ప్రశాంత్ చోప్రా (సి) రాహుల్ రాధేశ్ (బి) నిశాంత్ 1; అంకిత్ (సి) తన్మయ్ అగర్వాల్ (బి) తనయ్ త్యాగరాజన్ 31; అపూర్వ్ వాలియా (స్టంప్డ్) రాహుల్ రాధేశ్ (బి) అనికేత్ రెడ్డి 37; ఆకాశ్ వశిస్ట్ (సి) మిలింద్ (బి) అనికేత్ రెడ్డి 46; రిషి ధవన్ (ఎల్బీ) తనయ్ త్యాగరాజన్ 22; ఇనేశ్ మహజన్ (నాటౌట్) 68; ముకుల్ నేగీ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 0; మయాంక్ డాగర్ (సి) రక్షణ్ రెడ్డి (బి) వరుణ్ గౌడ్ 0; వైభవ్ అరోరా (సి) రక్షణ్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 3; దివేశ్ శర్మ (రనౌట్/హిమతేజ) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 275. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–111, 4–144, 5–188, 6–217, 7–217, 8–218, 9–267, 10–275, బౌలింగ్: నిశాంత్ 12–3–52–1; చామా మిలింద్ 13–1–32–0; తనయ్ త్యాగరాజన్ 24–4–62–2; అనికేత్ రెడ్డి 25–5–72–5; రక్షణ్ రెడ్డి 13–1–29–0; వరుణ్ గౌడ్ 5–0–16–1. హిమాచల్ ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (బ్యాటింగ్) 16; ప్రశాంత్ చోప్రా (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: తనయ్ త్యాగరాజన్ 3–0–13–0; రక్షణ్ రెడ్డి 2–1–4–0. -
అంతర్జాతీయ స్థాయిలో మన ఆడిటింగ్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: భారత ఆడిటింగ్ ప్రమాణాలు చాలా మటుకు అంతర్జాతీయ అకౌంటింగ్ స్టాండర్డ్‌లకు అనుగుణంగానే ఉంటున్నాయని ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ అనికేత్ తలాతి చెప్పారు. ఆడిటర్లంటే ప్రతి ఒక్క లావాదేవీ, ప్రతి ఇన్వాయిస్ను తప్పకుండా చూస్తారని భావించడానికి ఉండదని ఆయన తెలిపారు. లిస్టెడ్ కంపెనీలు ప్రతి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను 45 రోజుల్లోగా, వార్షిక ఫలితాలను 60 రోజుల్లోగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆడిటర్లు ప్రతి ఒక్క లావాదేవీని చూడటం సాధ్యపడదని, అసలు ఆడిట్ ఉద్దేశం అది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే, రిపోర్టింగ్ ప్రమాణాలు, బాధ్యతల విషయంలో ఆడిటర్లు సాంకేతికంగా అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు, సమగ్రతను పాటించాల్సి ఉంటుందని అనికేత్ చెప్పారు. -
రెండో రౌండ్లో అనికేత్, రాహుల్
జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలుర విభాగంలో వెంకట్ అనికే త్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సూర్యోదయ టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ టోర్నీ మొదటి రౌండ్లో అనికేత్ 8-0తో కొసరాజు హ ర్షిత్పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో రాహుల్ 8-0తో నిషాద్పై నెగ్గగా... దుర్గా హిమకేశ్ 8-0తో ఆకాశ్‌పై గెలిచాడు. అచిత్ బార్గత్ 8-0తో ఫణీంద్రపై గెలవగా... సాయి ప్రతీక్ 8-0తో సాయి సింహారెడ్డిని ఓడించాడు. ఇతర ఫలితాలు అండర్-16 బాలుర విభాగం: ప్రణవ్ రెడ్డి 8-2తో రిషిల్ గుప్తాపై; రిత్విక్ 8-1తో సచిత్పై; గౌతమ్ ఆకాశ్ 8-4తో సాయి సిద్ధార్థ్‌పై; ఆదిత్య 8-3తో రుచిత్ గౌడ్‌పై; నితిన్ 8-7, 7-3తో కార్తీక్ రెడ్డిపై; గౌరవ్ రెడ్డి 8-3తో తరుణ్‌పై; సుచిత్ 8-1తో రేవంత్ రెడ్డిపై; అక్షిత్ రెడ్డి 8-3తో సంప్రీత్ రెడ్డిపై; వినయ్ 8-4తో అభినవ్‌పై; సాయిహర్ష 8-0తో అర్జున్ రెడ్డిపై విజయం సాధించారు. అండర్-14 బాలికల విభాగం: లాస్య పట్నాయక్ 8-0తో లిఖితా మాన్సినిపై; శ్రేయ 8-1తో అవంతికా రెడ్డిపై; తనూజ చౌహాన్ 8-2తో దుర్గా శ్రీవేదపై; చరితా వాసి రెడ్డి 8-6తో ఫియోనా రేనాల్డ్పై; లిపికా 8-3తో సంస్కృతిపై నెగ్గారు.