విండీస్‌తో తొలి టెస్టుకి రూట్‌ అనుమానమే! | Joe Root May Not Play First Test Match Against West Indies | Sakshi
Sakshi News home page

విండీస్‌తో తొలి టెస్టుకి రూట్‌ అనుమానమే!

Jun 7 2020 1:22 AM | Updated on Jun 7 2020 1:22 AM

Joe Root May Not Play First Test Match Against West Indies - Sakshi

లండన్‌: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఆడేది అనుమానంగా మారింది. జూలై 8–12 మధ్య ఏజియస్‌ బౌల్‌లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్‌ జరుగనుండగా... అదే సమయంలో రూట్‌ భార్య తమ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రూట్‌ సెలవుపై తన భార్య దగ్గరికి వెళ్లనున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల ప్రకారం జాతీయ జట్టుతో మళ్లీ చేరాలంటే రూట్‌ ఏడు రోజుల స్వీయ నిర్బంధాన్ని పాటించాలి. దీంతో అతను తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం కష్టమవుతుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిగే ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌ పునరుద్ధరణ జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement