భూ ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు | Sakshi
Sakshi News home page

భూ ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు

Published Thu, Mar 28 2024 12:25 AM

ప్రభుత్వ భూమి వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు  
 - Sakshi

ఆగిరిపల్లి: మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ మృత్యుంజయరావు హెచ్చరించారు. ‘కోడ్‌ వేళ భూపందేరాలు?’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించగా, వారి ఆదేశాల మేరకు తహసిల్దార్‌ మృత్యుంజయరావు తన సిబ్బందితో కలిసి సింగన్నగూడెం సాయిబాబా గుడి ఎదురుగా ఆక్రమణలో ఉన్న రోడ్డు పోరంబోకు భూమిలో వేసిన ప్లానులు, గుడిసెలను అధికారులు ధ్వంసం చేసి, ఆ స్థలం చుట్టూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మృత్యుంజయరావు మాట్లాడుతూ ఎవరైనా ఈ భూమిని ఆక్రమించాలని చూస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవోపీఆర్డీ శేఖర్‌, ఆర్‌ఐ నవీన్‌కుమార్‌, వీఆర్వో రజిని, పంచాయతీ కార్యదర్శి పుల్లారావు పాల్గొన్నారు.

స్పందన
1/1

స్పందన

Advertisement
Advertisement