No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Mar 25 2024 1:50 AM

కరెంటు ఆదాపై అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ, అటవీ శాఖ సిబ్బంది - Sakshi

నర్సంపేట: సోలార్‌ విద్యుత్‌, పవన విద్యుత్‌ ప్రోత్సాహంతో ఖర్చులు లేకుండా వ్యాధులు రాకుండా ఉండడానికి రోజుకు ఒక గంట కరెంటును ఆదా చేయాలని డీసీఐసీ అధ్యక్షుడు గిరగాని సుదర్శన్‌గౌడ్‌ అన్నారు. ఈ మేరకు పట్టణంలో స్వచ్ఛంద సంస్థల సమాఖ్య, వినియోగదారుల సంఘం, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా శనివారం రాత్రి ఎర్త్‌ అవర్‌ డే నిర్వహించిన సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి కరెంటు ఆదా గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరెంటు తయారీకి ఉపయోగించే భూమి నుంచి వచ్చే పునరుత్పత్తి కానీ శిలాజ ఇంధనాలు, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువులు మండిస్తేనే థర్మల్‌ విద్యుత్‌ తయారవుతుందన్నారు. ఇలా మండించడం వల్ల వెలువడే విషవాయువులు జీవజాతులకు హానీకరమని తెలిపారు. భూమికాలుష్యం, భూమి వేడెక్కడం వంటి చర్చలు జరుగుతాయని వివరించారు. ఈ విధంగా వెలువడే వాయువుల్లో మిథెన్‌ కార్బన్‌ డైయాకై ్సడ్‌ మొదలైన గ్రీన్‌ హౌస్‌ వాయువులతో ఓజోన్‌ పొర దెబ్బతినడం, ఆమ్ల వర్షాలు పడడం, అతివృష్టి, అనావృష్టి తదితర ప్రకృతి వైఫరీత్యాలు ఏర్పడి మానవులతో సహా సకల జీవుల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని వివరించారు. ఇంతటి విధ్వంసాలకు కారణమైన కరెంటును ఎంత తక్కువ వాడితే అంత ఆదా జరిగి అటు పునరుత్పత్తి, శిలాజ ఇంధనాలు విలుప్తం(మాయమై పోకుండా) కాకుండా రాబోయే తరాలను కాపాడుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బెజ్జంకి ప్రభాకర్‌, కోట డేవిడ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వమే చిత్తశుద్ధితో ప్రజలను చైతన్యం చేసి కరెంటు ఆదా చేయాలని కోరారు. సోలార్‌, పవన విద్యుత్‌ ప్రోత్సాహకాలను ప్రభుత్వాలు ప్రకటించి కరెంటు ఆదా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, వినియోగదారుల సంఘాలు పాల్గొన్నారు.

డీసీఐసీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌

Advertisement
Advertisement