చంద్రబాబు కూటమి | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కూటమి

Published Fri, Apr 19 2024 1:40 AM

- - Sakshi

వంచించడానికే
● ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలుపు జగనన్నదే ● తిరుపతి ప్రజల గుండెల్లో అభివృద్ధి ప్రధాతగా అభినయ్‌ ● 31వ డివిజన్‌ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన

తిరుపతి మంగళం: మాయమాటలతో ప్రజలను వంచించడానికే చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి 31వ డివిజన్‌లో గురువారం పార్టీ సీనియర్‌ నాయకులు బొమ్మగుంట రవి, దుద్దేల బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతోపాటు మేయర్‌ డాక్టర్‌ శిరీష ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో భూమనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం బొమ్మగుంట రవి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రపంచ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధే పరమావధిగా జగనన్న పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పెత్తందారులకు కొమ్ముకాయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కడిగా పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని మండిపడ్డారు. తిరుపతిలో అభినయ్‌ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. తిరుపతిలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కూటమి నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాముల రమేష్‌రెడ్డి, దేవదానం, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, కంకనాల రమేష్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్‌ కట్టా గోపీయాదవ్‌, కార్పొరేటర్లు శేఖర్‌రెడ్డి, పొన్నాలచంద్ర, నరేంద్ర, ఆరణి సంధ్య, ఆధిలక్ష్మి, దూదికుమారి, కల్పనా యాదవకృష్ణ, మట్లి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు తిమ్మారెడ్డి, చిరంజీవి, చెంగల్రాయులు, కన్నయ్య, దాము, ఊతుకుంట మోహన్‌, ఇమ్రాన్‌, యాదవకృష్ణ, పుష్పలత, గల్లా కవిత, పుణీత, శారద పాల్గొన్నారు.

గుమ్మడికాయలు, టెంకాయలతో దిష్టితీస్తున్న స్థానికులు
1/2

గుమ్మడికాయలు, టెంకాయలతో దిష్టితీస్తున్న స్థానికులు

కరపత్రాలను పంచుతున్న ఎమ్మెల్యే భూమన, మేయర్‌ శిరీష
2/2

కరపత్రాలను పంచుతున్న ఎమ్మెల్యే భూమన, మేయర్‌ శిరీష

Advertisement
Advertisement