నిస్సాన్‌ మెగ్నేట్‌ షిప్ట్‌ ఏఎంటీ కార్‌ ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ మెగ్నేట్‌ షిప్ట్‌ ఏఎంటీ కార్‌ ఆవిష్కరణ

Published Sat, Nov 11 2023 12:46 AM

నిస్సాన్‌ షిప్ట్‌ ఏఎంటీ కార్‌ను ఆవిష్కరిస్తున్న షోరూం ప్రతినిధులు  - Sakshi

తిరుపతి కల్చరల్‌: రేణిగుంట రోడ్డులోని హిటాచ్‌ నిస్సాన్‌ కార్‌ షోరూంలో శుక్రవారం నిస్సాన్‌ మెగ్నేట్‌ ఈజెడ్‌–షి్‌ప్ట్‌ ఏఎంటీ కార్‌ను షోరూం ఎండీ సీ జగన్నాథరెడ్డి, డైరెక్టర్లు సీహెచ్‌ నిరంజన్‌, సీ హోషిమారెడ్డి, సీ భారతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం డైరెక్టర్‌ సీ నిరంజన్‌ మాట్లాడుతూ మేగ్నెట్‌ ఏఎంటీ కార్‌లో అనేక ఆధునిక ప్యూచర్స్‌తో పాటు దాని ధర రూ.6.49 లక్షలు మాత్రమేనన్నారు. ఈ కార్‌లో 205 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌, 336 బూట్‌ స్పేస్‌, 360 డిగ్రీస్‌ కెమెరా, 8 టచ్‌ స్క్రీన్‌, రివర్స్‌ కెమెరా, 16 అల్లాయ్‌ వీల్స్‌ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అంతేగాక అధిక మైలేజ్‌ 19.70 కిలోమీటర్స్‌, వైర్‌లెస్‌ కనక్టవిటీ, రేర్‌ ఏసీ వంటి సౌకర్యాలు కలిగి ఉందన్నారు. షోరూం జనరల్‌ మేనేజర్‌ ఎన్‌వీఎస్‌.శాస్త్రి, సేల్స్‌ మేనేజర్‌ మురళి పాల్గొన్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

తడ: జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ జేపీ శ్రీనివాసరెడ్డి కథనం.. సూళ్లూరుపేట మండలం, తోటకట్ల గ్రామానికి చెందిన పిచికారి జగన్‌(25) తడ ప్రాంతంలో తాపీ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఇతనిని శ్రీసిటీ జీరో పాయింట్‌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది. మృతుని జేబులో ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా తడ మండలం, కాశింగాడు కుప్పం గ్రామంలోని మృతుని సోదరికి సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.

లారీ బోల్తా

ఏర్పేడు: మండలంలోని మేర్లపాక వద్ద గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఓ లారీ బోల్తాపడింది. స్థానిక సీఐ శ్రీహరి కథనం.. శ్రీకాళహస్తి నుంచి మైసూరుకు గోతాల లోడ్డుతో వెళుతున్న లారీ మేర్లపాక వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది.

 బోల్తాపడ్డ లారీ
1/2

బోల్తాపడ్డ లారీ

మృతి చెందిన జగన్‌ (ఫొటో)
2/2

మృతి చెందిన జగన్‌ (ఫొటో)

Advertisement
Advertisement