మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సునీతా ముదిరాజ్‌ | Sunitha Mudiraj Appointed As Telangana Mahila Congress President | Sakshi
Sakshi News home page

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సునీతా ముదిరాజ్‌

Jun 25 2021 10:14 PM | Updated on Jun 26 2021 2:35 AM

Sunitha Mudiraj Appointed As Telangana Mahila Congress President - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర నూతన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సునీతా ముదిరాజ్‌ ఎంపికయ్యారు.  ఆమె ఎన్నికను జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షరాలు సోనియా గాంధీ ధృవీకరించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌ ప్రతికా ప్రకటన విడుదల చేశారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సునీతా ముదిరాజ్‌ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద సేవలను ఆయన ప్రశంసించారు. కాగా, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి రేసులో భవానీ రెడ్డి, ఇందిరా రావు, కాల్వ సుజాతలు ఉన్నప్పటికీ సునీతా ముదిరాజ్‌నే పదవి వరించింది.
చదవండి: గవర్నర్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Advertisement
 
Advertisement
Advertisement