రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు | RIMS Director Sensational Comments | Sakshi
Sakshi News home page

రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Aug 2 2020 1:38 PM | Updated on Aug 2 2020 1:57 PM

RIMS Director Sensational Comments - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: రిమ్స్‌లో వైద్య ఖాళీల భర్తీకి వైద్యులే అడ్డుపడుతున్నారంటూ రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాం నాయక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేయాలని జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులకు లేఖలు రాశాను. ఖాళీలు భర్తీ చేస్తే ఉన్న వైద్యులకు ఏ ఇబ్బందులు ఉండవు. అయినా వారు ఒప్పుకోవడం లేదు. నా సీటు నా పోస్టు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

స్థానిక రాజకీయ నాయకులు కూడా వైద్యులకు వత్తాసు పలుకుతూ రిక్రూట్‌మెంట్‌ వద్దంటూ.. రాజకీయం చేస్తున్నారు. ఉన్న సౌకర్యాలతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాము. 90శాతం నుంచి 100శాతం వరకు పనిచేస్తున్నామని రిమ్స్‌ డైరెక్టర్‌ బలరామ్‌ నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రిమ్స్‌ ఐసోలేషన్‌ కేంద్రం నుంచి 10మంది కరోనా పాజిటివ్‌ వ్యక్తులు పరారైన సంగతి తెలిసిందే. (10మంది కరోనా రోగులు పరారీ!)

Advertisement
 
Advertisement
Advertisement