Police Raid at 32 Farmhouse in Hyderabad Outskirts - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ శివార్లలోని 32 ఫామ్‌హౌస్‌లపై పోలీసుల దాడి

Feb 13 2023 4:46 PM | Updated on Feb 13 2023 6:14 PM

Police Raid At 32 Farmhouse In Hyderabad Outskirts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫామ్‌హౌస్‌లపై ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం దాడులు చేపట్టారు. మొయినాబాద్‌లోని బిగ్‌ బాస్‌ ఫామ్‌హౌస్‌, జహంగీర్ డ్రీమ్‌ వ్యాలి, శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్‌ ఫామ్‌హౌస్‌, మేడ్చల్‌లోని గోవర్ధన్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఫామ్‌హౌస్‌ల నుంచి మద్యం సీసాలు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్, లక్ష రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 32 ఫామౌస్‌లలో తనిఖీలు చేపట్టగా.. 26 మంది అరెస్ట్ చేశారు.
చదవండి: కేసీఆర్‌ నోట పదేపదే ఈటల మాట.. దీని వెనక మతలబు ఏంటీ?

Advertisement
 
Advertisement
Advertisement