కాసులిస్తే రైట్‌.. | Sakshi
Sakshi News home page

కాసులిస్తే రైట్‌..

Published Mon, Mar 25 2024 1:25 AM

నల్లబండగూడెం వద్ద ఉన్న తెలంగాణ–ఆంధ్రా సరిహద్దు రవాణా శాఖ చెక్‌పోస్టు 
 - Sakshi

ఇల్లాలే సూత్రధారి !
సఖ్యతకు అడ్డొస్తున్నాడన్న కారణంతోనే ఇల్లాలే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది.

సోమవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2024

- 8లో

కోదాడ: అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నల్లబండగూడెంకు సమీపంలో ఏర్పాటు చేసిన రవాణా శాఖ చెక్‌పోస్టు డబ్బుల వసూళ్లకు నిలయంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాసులిస్తే ఇక్కడ అంతా కరెక్ట్‌గానే ఉంటుందని, ఎలాంటి వాహనానికై నా, ఏ సరుకుకై నా ఇక్కడి అధికారులు రైట్‌ చెపుతారని వాహనదారులే అంటున్నారు. ఈ చెక్‌పోస్టు వద్ద రోజువారీ అక్రమ వసూళ్లు రూ.లక్షల్లో ఉంటాయనేది బహిరంగ రహస్యం. ఇక్కడ కొనసాగుతున్న అక్రమాలు, వసూళ్లను కప్పిపుచ్చుకోవడానికి పైస్థాయిలో ఉన్న 40 నుంచి 50 మంది అధికారులకు రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షలు నెలవారీ మూముళ్లు ఇస్తున్నారంటే ఇక్కడ వసూళ్ల పర్వం ఏ స్థాయిలో జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అక్రమార్కులే బంగారు బాతులు

అక్రమ దందా చేసే వారే ఈ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి బంగారు బాతులుగా ఉంటారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కాకినాడకు రేషన్‌ బియ్యం రవాణా చేసే లారీలు, ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పశువులను రవాణా చేసే వాహనాలు, ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుకు రవాణా చేసే లారీలు, అధిక లోడ్‌తో వెళ్లే సిమెంట్‌ లారీలు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, పర్మిట్‌ తీరిపోయిన వాహనాల నుంచి ఇక్కడి సిబ్బంది వేల రూపాయలు వసూలు చేస్తుంటారని పలువురు ఆరోపిస్తున్నారు. అన్ని సక్రమంగా ఉన్నా తమ నుంచి కూడా చెక్‌పోస్టు సిబ్బంది నిర్దేశించిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తుంటారని పలువురు వాహనదారులు వాపోతున్నారు.

నెలవారీగా మామూళ్లు

ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మొదటి తేదీన వేతనాలు రావడం కష్టమే. కానీ ఈ చెక్‌పోస్టు వద్ద అక్రమాలు బయట పడకుండా కప్పిపుచ్చే వారికి ఇక్కడి సిబ్బంది మాత్రం ప్రతినెలా మొదటి తేదీనే మామూళ్లు ఇస్తున్నట్టు సమాచారం. వాహనదారుల నుంచి లంచాల రూపంలో నిత్యం వసూలు చేస్తున్న లక్షల రూపాయలను నెల రోజుల తరువాత ఒక దగ్గరకు చేర్చి పంపకాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి ఓ అధికారి బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో చెక్‌పోస్టు వద్ద జరిగే వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని పలువురు అంటున్నారు. గడిచిన ఏడెనిమిది సంవత్సరాల కాలంలో ఈ చెక్‌పోస్టులో మాత్రం ఒక్క అక్రమ రవాణా వాహనం పట్టుబడలేదు. దీన్ని బట్టే ఇక్కడ చెకింగ్‌ ఏ మాత్రం జరుగుతుందో తెలుస్తోంది.

న్యూస్‌రీల్‌

అక్రమాలకు నిలయంగా నల్లబండగూడెం చెక్‌పోస్టు

ఫ ముడుపులిస్తే ఏ వాహనానికై నా

అనుమతే..

ఫ తెలంగాణ–ఆంధ్రాకు యథేచ్ఛగా సరుకు అక్రమ రవాణా

ఫ మాముళ్ల మత్తులో పట్టించుకోని రవాణా శాఖ ఉన్నతాధికారులు

వసూళ్లకు భయపడి అడ్డదారిన..

ఈ చెక్‌పోస్టు వసూళ్లను తట్టుకోలేక పలువురు అడ్డదారిలో తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారు. ఆంధ్రా–తెలంగాణ సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రస్తుత చెక్‌పోస్టు ఉంటుంది. ఈ చెక్‌పోస్టును తప్పించుకోవడానికి కొందరు అక్రమార్కులు ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించగానే రామాపురం క్రాస్‌ రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి లారీలు హైవే మీదుగా కాకుండా రెడ్లకుంట నుంచి కాపుగల్లు, గుడిబండ గ్రామాల మీదుగా కోదాడ బైపాస్‌కు చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్నాయి. మరో మార్గంలో ఆంధ్రాలోని జగ్గయ్యపేట, బలుసుపాడు, అన్నారం మీదుగా తెలంగాణలోని రెడ్లకుంటకు చేరుకొని అక్కడ నుంచి కాపుగల్లు, గుడిబండ మీదుగా కోదాడ బైపాస్‌కు చేరుతున్నాయి. ఈ రోడ్లు కోదాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్నా నిఘా పెట్టకపోవడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కోదాడకు చెందిన ఇద్దరు వ్యాపారులు ఈ మార్గంలో లారీలను రప్పించి కోదాడలో ఇసుక అమ్ముతున్నారు. వారం రోజుల క్రితం వీరి మధ్య బేధాలు వచ్చి ఒకరిమీ మరొకరు దాడులు చేసుకొవడంతో శుక్రవారం పట్టణ పోలీసులు వీరిని కోదాడ తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌ చేసిన విషయం విదితమే.

1/1

Advertisement
Advertisement