జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను బదిలీ చేయొద్దు | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను బదిలీ చేయొద్దు

Published Sat, Mar 23 2024 1:15 AM

ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న వైద్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది
 - Sakshi

సూర్యాపేట: సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రి (జీజీ హెచ్‌) సూపరింటెండెంట్‌ దండ మురళీధర్‌రెడ్డి చేయొద్దంటూ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ రాజకీయ జోక్యంతోనే మురళీధర్‌రెడ్డిని అక్రమంగా బదిలీ చేశారని ఆరోపించారు. కరోనా సమయంలో వెలకట్టలేని వైద్యసేవలు అందించిన ఘనత మురళీధర్‌రెడ్డిదే అన్నారు. ఇప్పటికీ ఆస్పత్రిలో పేదలకు విలువైన వైద్యసేవలను అందిస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయ నిరుద్యోగులు వైద్య వృత్తిని కలుషితం చేయవద్దంటూ వేడుకున్నారు. మా ప్రాంతం డాక్టర్‌ మాకే కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

బదిలీ సరైందేనంటూ మరికొందరు..

ఇదిలా ఉంటే సూపరింటెండెంట్‌ మురళీధర్‌రెడ్డి బదిలీ సరైందేనని, తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపిస్తూ కొందరు బాధితులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అన్ని ఆధారాలతో హైదరాబాద్‌లో ఆయనపై ఫిర్యాదు చేశామన్నారు. కొందరిని తన అనుచరులుగా మార్చుకొని ధర్నా చేయిస్తున్నారన్నారు.

Advertisement
Advertisement