జీవకోటికి నీరే ప్రాణాధారం | Sakshi
Sakshi News home page

జీవకోటికి నీరే ప్రాణాధారం

Published Sat, Mar 23 2024 1:15 AM

ఇంకుడు గుంతల ఏర్పాటుపై కలెక్టరేట్‌లో అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ వెంకటరావు
 - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): జీవకోటికి నీరే ప్రాణాధారమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు అన్నారు. శుక్రవారం ప్రపంచ నీటి దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ ఉద్యోగులకు ఇంకుడు గుంతల నిర్వహణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉంటేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. భవిష్యత్‌ తరాలకోసం నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నీరు వృథాగా పోకుండా ప్రతి ఇంటిముందు ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ప్రతి ఒక్కరితో నీరు పోసి మొక్కని కాపాడాలని, ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం ఉద్యోగులతో నీటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏఓ సుదర్శన్‌రెడ్డి, సూపరిటీడెంట్‌ పద్మారావు, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాసరాజు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘గ్రీవెన్స్‌’ కార్యాలయం ప్రారంభం

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఎ–38 రూమ్‌లో గ్రీవెన్స్‌ కమిటీ కార్యాలయాన్ని కలెక్టర్‌ వెంకటరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగా సీజ్‌ అయిన నగదు విడుదల కోసం గ్రీవెన్స్‌ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఆ మొత్తాన్ని సీజ్‌ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తారన్నారు. జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ కార్యాలయ ఇన్‌చార్జి జెడ్పీ సీఈఓ సెల్‌ : 83745 66222 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లత, జెడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఏఓ సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

ఫ భవిష్యత్‌ తరాలకోసం

నీటి వనరులను కాపాడాలి

ఫ ప్రతి ఇంటి ముందు

ఇంకుడు గుంత ఉండాలి

ఫ కలెక్టర్‌ వెంకటరావు

గ్రీవెన్స్‌ కమిటీ కార్యాలయాన్ని 
ప్రారంభిస్తున్న కలెక్టర్‌
1/1

గ్రీవెన్స్‌ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

Advertisement
Advertisement