వెర్‌స్టాపెన్‌కు ‘పోల్‌’  | Today is the Japanese Grand Prix | Sakshi
Sakshi News home page

వెర్‌స్టాపెన్‌కు ‘పోల్‌’ 

Sep 24 2023 1:35 AM | Updated on Sep 24 2023 1:35 AM

Today is the Japanese Grand Prix - Sakshi

సుజుకా (జపాన్‌): ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో ఎదురులేని రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తొమ్మిదోసారి పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన జపాన్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 28.877 సెకన్లలో ముగించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 రేసులు జరగ్గా, రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్లు వరుసగా 14 రేసుల్లో విజేతలుగా నిలిచారు. వెర్‌స్టాపెన్‌ 12 రేసుల్లో, పెరెజ్‌ రెండు రేసుల్లో గెలిచారు. గతవారం జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌ చాంపియన్‌గా నిలిచి రెడ్‌బుల్‌ జట్టు జైత్రయాత్రకు అడ్డుకట్ట వేశాడు.   

Advertisement
 
Advertisement
Advertisement