SL vs WI: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్లపై వేటు! | Sri Lanka announce 17-member squad for T20I series against West Indies | Sakshi
Sakshi News home page

SL vs WI: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్లపై వేటు!

Oct 10 2024 1:55 PM | Updated on Oct 10 2024 3:12 PM

Sri Lanka announce 17-member squad for T20I series against West Indies

వెస్టిండీస్‌తో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు 17 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును శ్రీలంక క్రికెట్ ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌కు లంక స్టార్ ప్లేయ‌ర్లు దాసున్ ష‌న‌క‌, దుష్మంత చ‌మీరా దూర‌మ‌య్యారు. 

ఈ ఏడాది జూలైలో భార‌త్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో వీరిద్దరూ భాగ‌మ‌య్యారు. గ‌త సిరీస్‌లో ఈ సీనియ‌ర్ ఆట‌గాళ్లు చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే వారిని సెల‌క్ట‌ర్లు పక్క‌న పెట్టినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఏడాది త‌ర్వాత మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ భ‌నుక రాజ‌పాక్స‌కు లంక సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు.

ఈ జ‌ట్టుకు స్టార్ ఆల్‌రౌండ‌ర్ అస‌లంక సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఆక్టోబ‌ర్ 13 నుంచి దంబుల్లా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం విండీస్ ఇప్ప‌టికే త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్స్, చైమీ వాండర్సే మతీషా పతిరానా, బినూర ఫెర్నాండో, అసిత ఫెర్నాండో.
 

Advertisement
 
Advertisement
Advertisement