ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ISSF వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సామ్రాట్ రాణా మరో గర్వకారణ విజయాన్ని నమోదు చేశాడు. 22 ఏళ్ల సామ్రాట్ రాణా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 243.7 స్కోర్‌తో గోల్డ్ మెడల్ సాధించాడు. తద్వారా ఈ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు.
ఫైనల్లో రాణా చైనా షూటర్ హూ కైపై 0.4 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ వరుణ్ తోమార్ కాంస్య పతకం సాధించాడు. తద్వారా ఈ ఈవెంట్‌లో భారత్‌కు డబుల్ పోడియం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో రాణా.. వరుణ్ తోమార్, షర్వన్ కుమార్‌లతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు.
ఐదో భారతీయుడు
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించడంతో రాణా హేమాహేమీల సరసన చేరాడు. ఒలింపిక్ ఈవెంట్‌లో వరల్డ్ టైటిల్ గెలిచిన ఐదో భారతీయుడిగా అభినవ్ బింద్రా, రుద్రాంక్ష్ పాటిల్, తేజస్విని సావంత్, శివ నర్వాల్ – ఈషా సింగ్ (మిక్స్‌డ్ టీమ్) సరసన చేశాడు.
నిరాశపరిచిన మను బాకర్
స్టార్ షూటర్ మను బాకర్ వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచినా, టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. ఈషా సింగ్, సురుచి సింగ్‌లతో కలిసి వుమెన్స్ టీమ్ సిల్వర్ గెలుచుకుంది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో సామ్రాట్ రాణా గోల్డ్ మెడల్ గెలవడంతో ISSF వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత పతకాల సంఖ్య 9కి (3 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రాంజ్) చేరింది. పతకాల పట్టికలో చైనా 12 మెడల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది.
చదవండి: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు..!


