ముంబై ‘బోనస్‌’ విజయం | Mumbai team defeats Chandigarh by an innings and 155 runs in the opening Ranji Trophy match | Sakshi
Sakshi News home page

ముంబై ‘బోనస్‌’ విజయం

Oct 14 2026 3:49 AM | Updated on Oct 14 2026 3:49 AM

Mumbai team defeats Chandigarh by an innings and 155 runs in the opening Ranji Trophy match

రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోచండీగఢ్‌పై ఇన్నింగ్స్‌ 155 పరుగులతో విజయం

రాణించిన షమ్స్‌ ములానీ, తుషార్,తనుశ్‌ కొటియాన్‌

ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో ముంబై జట్టు శుభారంభం చేసింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ టైటిల్‌ కైవసం చేసుకున్న ముంబై జట్టు 2026–27 సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ ముంబై ఇన్నింగ్స్‌ 155 పరుగుల తేడాతో చండీగఢ్‌పై గెలిచింది.

ఈ విజయంతో ముంబై ఖాతాలో ‘బోనస్‌’ పాయింట్‌తో కలిపి మొత్తం 7 పాయింట్లు చేరాయి. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోరు చేసింది. జవాబుగా చండీగఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 0/1తో మంగళవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన చండీగఢ్‌ చివరకు 52.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. 

అర్జున్‌ ఆజాద్‌ (71 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకం సాధించగా... శివమ్‌ బాంబ్రీ (44; 6 ఫోర్లు) పోరాడాడు. మిగిలినవాళ్లంతా విఫలమవడంతో చండీగఢ్‌కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో షమ్స్‌ ములానీ, తనుశ్‌ కొటియాన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తుషార్‌ దేశ్‌పాండేకు 2 వికెట్లు దక్కాయి. గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఈ నెల 18 నుంచి జరగనున్న తదుపరి మ్యాచ్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌తో ముంబై జట్టు తలపడనుంది.  

ఉత్తరప్రదేశ్‌ 267 పరుగులతో గెలుపు 
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా రాజ్‌గిర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్‌ జయభేరి మోగించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ ఇన్నింగ్స్‌ 267 పరుగుల తేడాతో బిహార్‌ను చిత్తుచేసి బోనస్‌ పాయింట్‌తో కలిపి మొత్తం 7 పాయింట్లు సాధించింది. మొదట ఉత్తర ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులు చేయగా... ఓవర్‌నైట్‌ స్కోరు 44/2తో మంగళవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బిహార్‌ జట్టు రెండుసార్లు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 52.1 ఓవర్లలో 141 పరుగులకు కుప్పకూలింది. 

మంగళ్‌ మహ్రూర్‌ (25) టాప్‌ స్కోరర్‌ కాగా... తక్కినవాళ్లంతా పెవిలియన్‌కు వరుస కట్టారు. ఉత్తర ప్రదేశ్‌ బౌలర్లలో కరణ్‌ శర్మ, కార్తీక్‌ యాదవ్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ జట్టుకు 399 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించగా... ఫాలోఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లోనూ బిహార్‌ నిరాశ పరిచింది. ఉత్తరప్రదేశ్‌ బౌలర్ల ధాటికి మరోసారి బ్యాటర్లు చేతులెత్తేయడంతో 36.4 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది.

మంగళ్‌ (27; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో జీషాన్‌ అన్సారీ 4, కరణ్‌ శర్మ 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాధవ్‌ కౌశిక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న తదుపరి మ్యాచ్‌లో గోవాతో ఉత్తరప్రదేశ్‌ ఆడనుంది.  

అభిషేక్‌ నాయర్‌ సెంచరీ...
ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లోభాగంగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో కేరళ జట్టు పోరాడుతోంది. జంషెడ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో జార్ఖండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేయగా... మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ నాయర్‌ (204 బంతుల్లో 126; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... రోహన్‌ (44; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సచిన్‌ బేబీ (35; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జార్ఖండ్‌ బౌలర్లలో ఉత్కర్‌‡్ష సింగ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లు ఉన్న కేరళ... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది.

ఇతర మ్యాచ్‌ల సంక్షిప్త స్కోర్లు
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’ 
బరోడా తొలి ఇన్నింగ్స్‌: 472/8 డిక్లేర్డ్‌; గోవా తొలి ఇన్నింగ్స్‌: 199 ఆలౌట్‌; (ఫాలోఆన్‌) గోవా రెండో ఇన్నింగ్స్‌: 35/1. 
మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 196; జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: 120 ఆలౌట్‌; మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: 151/5 (శుభమ్‌ శర్మ 51 బ్యాటింగ్‌; ఆఖిబ్‌ నబీ 2/31).  
విదర్భ తొలి ఇన్నింగ్స్‌: 428; పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌: 313; విదర్భ రెండో ఇన్నింగ్స్‌: 22/1.

ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ 
అస్సాం తొలి ఇన్నింగ్స్‌: 373; పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌: 287/5 (విహాన్‌ మల్హోత్రా 103, హర్‌నూర్‌ సింగ్‌ 54; స్వరూపం పుర్కాయస్థా 2/52). 
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌: 392; ఛత్తీస్‌గఢ్‌ తొలి ఇన్నింగ్స్‌: 312; సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌: 45/2.

ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’ 
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌: 240; బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌: 429; ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌: 101/3.  
ఒడిశా తొలి ఇన్నింగ్స్‌: 324; గుజరాత్‌ తొలి న్నింగ్స్‌: 439; ఒడిశా రెండో ఇన్నింగ్స్‌: 119/4. 
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌: 333; సర్వీసెస్‌ తొలి ఇన్నింగ్స్‌: 227; మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌: 66/5 (అంకిత్‌ బావ్నే 32 బ్యాటింగ్‌; అర్జున్‌ శర్మ 4/30).

ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’ 
హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 253; హరియాణా తొలి ఇన్నింగ్స్‌: 296; హిమాచల్‌ ప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: 113; హరియాణా రెండో ఇన్నింగ్స్‌: 26/3. 
రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌: 278; ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 470 (సౌరభ్‌ రావత్‌ 107; రాజ్‌ చౌధరీ 3/94); రైల్వేస్‌ రెండో ఇన్నింగ్స్‌: 34/0.  రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 363; తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌: 274 (ఆండ్రె సిద్ధార్థ్‌ 81; అజయ్‌ సింగ్‌ 5/51); రాజస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 81/4. 

ప్లేట్‌ గ్రూప్‌ 
మిజోరం తొలి ఇన్నింగ్స్‌: 183; మణిపూర్‌ తొలి ఇన్నింగ్స్‌: 251; మిజోరం రెండో ఇన్నింగ్స్‌: 295; మణిపూర్‌ రెండో ఇన్నింగ్స్‌: 8/0. 
సిక్కిం తొలి ఇన్నింగ్స్‌: 245; మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌: 395; సిక్కిం రెండో ఇన్నింగ్స్‌: 44/0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement