
PC: Twitter
India vs Australia, 2nd Test: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు శుక్రవారం (ఫిబ్రవరి 17) మొదలైంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో వార్మప్ చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకువచ్చాడు. అనంతరం అతడిని గమనించిన భద్రతా సిబ్బంది.. పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని మైదానం బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.
శభాష్ షమీ..
ఈ క్రమంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన మంచి మనసు చాటుకున్నాడు. సెక్యూరిటీ దగ్గరకు వచ్చిన షమీ.. బలవంతంగా అతడిని ఈడ్చుకువెళ్లొద్దంటూ చెప్పాడు. ఇలా తన చర్యతో షమీ అభిమానుల మనసును గెలుచుకున్నాడు. దీంతో.. నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రాణించిన ఖవాజా..
ఇక రెండో టెస్టు విషయానికి వస్తే.. తొలి రోజు టీ విరామానికి 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 125 బంతుల్లో అతడు 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 81 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటి వరకు భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు, షమీ రెండు, జడేజా ఓ వికెట్ సాధించారు.
చదవండి: IND vs AUS: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
मैदान में घुसे फैन की गार्ड ने की पिटाई फिर शमी ने दिखाया बड़ा दिल#INDvAUS #Shami #CricketTwitter #DelhiTest pic.twitter.com/Uia7mxZd8s
— Akhil Gupta 🏏 (@Guptastats92) February 17, 2023