పూల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్‌

IPL 2021: Virat Kohli Shirtless Photo During RCB Pool Session - Sakshi

Virat Kohli’s Shirtless Photo During RCB’s Pool Session: ప్రపంచంలోనే అంత్యంత ప్రజాదరణ పొందిన క్రికటర్‌ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడు. అయితే ఐపీఎల్‌2021 సెకెండ్‌ ఫేజ్‌లో రెండు వరుస అపజాయాల తర్వాత ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి ఆర్సీబీ  తిరిగి ట్రాక్‌లో పడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైను 54 పరుగుల తేడాతో బెంగళూరు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు సహచర ఆటగాళ్లు స్విమ్మింగ్‌ పూల్‌లో సేద తీరుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో  వైరల్‎గా మారాయి. ముఖ్యంగా కోహ్లి షర్ట్‌ లేకుండా ఉన్న ఫొటోలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా శుక్రవారం( సెప్టెంబర్‌ 29)న రాజస్తాన్‌ రాయల్స్‌తో  బెంగళూరు తలపడనుంది.

చదవండి: MS Dhoni: ఈ సీజన్‌ తర్వాత రిటైర్మెంట్‌.. హెడ్‌కోచ్‌గా.. లేదంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top