Asian Games 2023: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌ మెడల్‌.. అదరగొడుతున్న షూటర్లు | Indian shooters clinch gold in 10m air pistol team event at Asian Games 2023 | Sakshi
Sakshi News home page

Asian Games 2023: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌ మెడల్‌.. అదరగొడుతున్న షూటర్లు

Sep 28 2023 8:41 AM | Updated on Sep 28 2023 12:33 PM

Indian shooters clinch gold in 10m air pistol team event at Asian Games 2023 - Sakshi

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత షూటర్లు సత్తాచాటుతున్నారు. గురువారం మరో బంగారు పతకాన్ని మన షూటర్లు సొంతం చేసుకున్నారు.  పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్‌, చీమాలో కూడిన భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

క్వాలిఫయింగ్‌లో సరబ్జోత్ , శివ నర్వాల్, అర్జున్ సింగ్‌, చీమా 1734 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్ధానంలో నిలిచారు.  దీంతో భారత ఖాతాలో ఆరో గోల్డ్‌మెడల్‌ వచ్చి చేరింది. ఇక 1733 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఆతిథ్య చైనా సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది. ఇక ఓవరాల్‌గా భారత్‌కు ఇది ఆరో గోల్డ్‌మెడల్‌. అందులో నాలుగు పతకాలు షూటింగ్‌లో వచ్చినవే కావడం విశేషం. ఓవరాల్‌గా 24 పతకాలతో భారత్‌ ఐదో స్థానంలో ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement