Shardul Thakur: పాపం బుమ్రా, షమీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.. కానీ శార్దూల్‌.. అస్సలు ఊహించలేదు కదా!

Ind Vs Sa 2nd Test: Netizens Reacts as Shardul Thakur Runs Through SA Batting Order - Sakshi

Ind Vs Sa 2nd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ‘లార్డ్‌’ శార్దూల్‌ ఠాకూర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి ప్రొటిస్‌ను దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే మూడు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్న శార్దూల్‌ పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పే దిశగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఈ యువ ఆటగాడిపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

‘‘లార్డ్‌ శార్దూల్‌... టీమిండియా ఫెయిర్‌ ప్లేను నమ్ముతుంది. అందుకే లార్డ్‌ ఎప్పుడూ కొత్త బ్యాటర్లకు బౌల్‌ చేయడు. ప్రత్యర్థి జట్టు భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తున్న సమయంలో రంగంలోకి దిగుతాడు. వాళ్లను అవుట్‌ చేసేస్తాడు’’అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ శార్దూల్‌ను ఆకాశానికెత్తాడు. ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం... శార్దూల్‌ అద్భుతంగా బౌల్‌ చేస్తున్నాడంటూ ప్రశంసించాడు. 

ఇంకొంత మంది నెటిజన్లు... ‘‘పాపం దక్షిణాఫ్రికా బుమ్రా, షమీ, అశ్విన్‌ బౌలింగ్‌ ఎదుర్కునేందుకు ప్రణాళికలు రచించింది. కానీ లార్డ్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రంగంలోకి దిగాడు. అవుటాఫ్‌ సిలబస్‌ కదా’’అంటూ ఫన్మీ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఇక అభిమానులైతే.. ‘‘తక్కువ అంచనాలు.. అత్యద్భుతంగా రాణింపు.. అదీ మరి శార్దూల్‌ అంటే! నిజమైన పేసు గుర్రం అతడు’’ అంటూ మురిసిపోతున్నారు. కాగా వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్‌ ఎల్గర్‌, పీటర్సన్‌, వాన్‌ డెర్‌ డసెన్‌ వికెట్లు తీసి లంచ్‌ బ్రేక్‌ సమయానికి ముందు శార్దూల్‌ ఈ టీమిండియా శిబిరంలో జోష్‌ నింపాడు.

చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్‌ మెగా వేలం వేదిక, తేదీలు మార్పు.. ఎందుకంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top