విశ్వనాథన్‌ ఆనంద్‌తో తలపడనున్న ఆమీర్ ఖాన్‌.. ఎందుకో తెలుసా?

Aamir Khan To Play Exhibition Chess Match With Viswanathan Anand For Covid 19 Relief - Sakshi

ముంబై: బాలీవుడ్ సూపర్‌ స్టార్‌, మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమీర్ ఖాన్‌, చెస్ మాజీ ప్రపంచ ఛాంపియ‌న్ విశ్వనాథ‌న్ ఆనంద్‌ చదరంగం పోరులో ఎత్తుకు పైఎత్తు వేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 13న(ఆదివారం) సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల మ‌ధ్య ఈ గేమ్ జ‌ర‌గ‌నున్నట్లు chess.com ప్రకటించింది. ఈ గేమ్‌ను chess.com తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

'చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వ‌చ్చింది. చెస్ ల‌వ‌ర్ అయిన‌ సూప‌ర్ స్టార్ ఆమీర్ ఖాన్‌.. మాజీ ప్రపంచ ఛాంపియ‌న్ విశ్వనాథ‌న్ ఆనంద్‌తో ఎగ్జిబిష‌న్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఈవెంట్‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వండి' అంటూ చెస్‌.కామ్‌ ట్వీటర్‌ ద్వారా పిలుపునిచ్చింది. గ‌తంలో ఈ ఇద్దరూ చెస్ ఆడిన ఫొటోను ఓ అభిమాని కామెంట్స్‌లో షేర్ చేశాడు. ఇద్దరు పర్ఫెక్షనిస్ట్‌ల మధ్య సాగబోయే ఈ గేమ్ రసవత్తరంగా సాగబోతుందంటూ ఆ అభిమాని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా, కోవిడ్‌పై పోరులో భాగంగా విరాళాలు సేక‌రించేందుకు ఇద్దరు ప్రముఖ పర్సనాలిటీల మధ్య గేమ్‌ను ప్లాన్‌ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్‌కు చెక్‌మేట్ కోవిడ్ అనే పేరు పెట్టారు. కోవిడ్‌తో బాధ‌ప‌డుతున్న చెస్ ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కు ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ఈ ఈవెంట్‌ను ప్లాన్‌ చేశారు. ఈవెంట్‌ జరిగే రోజు ఆమీర్‌ ఖాన్‌తో పాటు మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు ఆనంద్‌తో చెస్ ఆడ‌నున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
చదవండి: టీమిండియా ప్రాక్టీస్‌ అదుర్స్‌.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top