
మద్యం మత్తులో పోలీసులపై దాడి
ఐదుగురు యువకులపై కేసు
శివ్వంపేట(నర్సాపూర్): మద్యం మత్తులో యువకులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శివ్వంపేట పోలీసులు తూప్రాన్– నర్సాపూర్ హైవే పై పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో శనివారం సాయంత్రం డ్రంకై న్ డ్రైవ్‌లో భాగంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు బైక్‌లపై ఐదుగురు యువకులు హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో శివ్వంపేట వైపునకు వస్తుండగా పోలీసులు ఆపారు. మా బైక్‌లనే ఆపుతారా అని ఆ యువకులు పోలీసులను దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించినప్పటికీ అక్కడ కూడా పోలీసులను దూషిస్తూ హల్‌చల్ చేశారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు బిజ్లిపూర్ గ్రామ శివారులో ఉన్న శ్రీవాస్ లైప్ సైన్స్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గోమారం గ్రామానికి చెందిన ఎండీ రషీద్, గుంటూరు ప్రాంతానికి చెందిన బానావాత్ సైదానాయక్, బుక్య భీమానాయక్, గగ్లోత్ గోపినాయక్, బనావాత్ నందునాయక్ గా గుర్తించినట్లు చెప్పారు.