ఒంటరి మహిళలే టార్గెట్‌ | Sakshi
Sakshi News home page

<script>
document.addEventListener("DOMContentLoaded", function() {
 var newsContent = document.querySelector(".news-story-content");
    var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p"));
 
  var firstParagraph = paragraphs.find(function(paragraph) {
       return !paragraph.closest('.bullet_list');
   });
  if (firstParagraph.length > 1) {
   var secondParagraph = firstParagraph[1];

 var script = document.createElement("script");
 script.async = true;
 script.id = "AV62ff84d96d945e7161606a7a";
 script.type = "text/javascript";
 script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…";
 
 secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling);
}
});
</script>

ఒంటరి మహిళలే టార్గెట్‌

Published Tue, Mar 26 2024 8:00 AM

-

● దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

పటాన్‌చెరు టౌన్‌: ఒంటరి మహిళలే టార్గెట్‌ చేసి దారి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు ముఠాను పోలీసులు కటకటాల వెనుకకు పంపారు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్‌ రెడ్డి, క్రైమ్‌ సీఐ రాజు తెలిపిన వివరాల మేరకు... కిష్టారెడ్డిపేట, ఇంద్రేశం, రామేశ్వరంబండ శివారులో ఏడుగురితో కూడిన ముఠా నివసిస్తుంది. పారిశ్రామిక వాడలో ఒంటరి మహిళలనే టార్గెట్‌ చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతుంది. సోమవారం మండలంలోని ఇంద్రేశం వద్ద ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ లో వాహనాలను తనిఖీలు చేస్తుంటే పోలీసులను చూసి పారిపోతున్న ఏర్పుల నర్సింహులు, హరిజన నర్సింహులు, నాందారి హనుమంతు, వడ్డే అంజమ్మ, విశ్లవత్‌ ఇందిర అలియాస్‌ లత, లకి్‌ష్మ్‌ అలియాస్‌ దుర్గ, నిర్మలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారిస్తే చేసిన దోపిడీలను ఒప్పుకున్నారు. దీంతో వారి నుంచి మూడు ఫోన్‌లు, రెండు తులాల బంగారం, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై పటాన్‌చెరు స్టేషన్‌ లో మూడు కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన ఏడుగురిని సోమవారం రాత్రి పటాన్‌చెరు పోలీసులు రిమాండ్‌ తరలించారు.

మాకు న్యాయం చేయండి

● ఆర్టీసీ అధికారుల వేధింపులపై మంత్రికి కార్మికుల వినతి

● ఆర్‌ఎం దృష్టికి తీసుకువెళ్లినా

ఫలితం శూన్యం

జహీరాబాద్‌ టౌన్‌: మమ్మల్ని ఆర్టీసీ డిపో మేనేజర్‌, కొంత మంది అధికారులు వేధిస్తున్నారని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణానికి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో కొంత మంది కార్మికులు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారన్న నెపంతో వారిపై అధికారులు కక్ష గట్టారని ఆరోపించారు. డ్యూటీలు, సెలవుల పరంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఆరోగ్య సమస్యలు వచ్చినా సెలవు ఇవ్వడం లేదన్నారు. మహిళా కార్మికులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. న్యాయపరంగా మాట్లాడితే సర్వీస్‌ నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కార్మికులను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించేకునేలా.. తమకు న్యాయం చేయాలని కోరారు. మంత్రికి వినతి పత్రం ఇచ్చిన వారిలో కార్మికులు ఎం. మా ణిక్‌, శ్రీనివాస్‌, తుల్జయ్య, జీవన్‌, మోహన్‌, శంకర్‌ నరేందర్‌ ఉన్నారు.

రిమాండ్‌ కు తరలించిన ఏడుగురు నిందితులు

Advertisement
Advertisement