గంటా మోహనరావు (జీఎంఆర్)
ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని గెలిచి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుక ఇస్తామని వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు (జీఎంఆర్) అన్నారు. ఏలూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారని, చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే బీసీలను చూశారని వ్యాఖ్యానించారు. మేయర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్కు జీఎంఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కూటమి ప్రభుత్వానికి గుణపాఠం: జయప్రకాష్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి జయప్రకాష్ అన్నారు. రెండు సంవత్సరాల కూటమి పాలనలో ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామన్నారు. ఏలూరు కార్పొరేషన్లో జరిగిన అవినీతి ప్రజలకు తెలియజేసే వారిని చైతన్యవంతులు చేస్తామని చెప్పారు.
వైఎస్ జగన్ చేసిన సంక్షేమమే తమ జెండా అని జయప్రకాష్ తెలిపారు. 2019 నుండి 24 వరకు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఏలూరు మేయర్తో పాటు 62 డివిజన్లలో గెలిచి తమ పార్టీ అధ్యక్షుడికి కానుక ఇస్తామని అన్నారు. మేయర్, 62 డివిజన్ల అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించామని చెప్పారు. మేయర్ అభ్యర్థులుగా 11 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. బీసీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన గంటా మోహనరావును ఏలూరు మేయర్ అభ్యర్థిగా వైఎస్ జగన్ ఎంపిక చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
జీఎంఆర్ రాజకీయ నేపథ్యం
గంటా మోహనరావు (57) ఏలూరు నగర రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. 2011 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ కొమడవోలు పంచాయతీ నుంచి ఆయన సోదరుడిని గెలిపించుకున్నారు. ఆ తరువాత వైఎస్సార్సీపీలో కొనసాగుతూ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
జీఎంఆర్ ప్రొఫైల్
అభ్యర్థి పేరు: గంటా మోహనరావు (జీఎంఆర్)
పుట్టినతేది: 14.02.1969
విద్యార్హత: బీఏ, కులం: తూర్పు కాపు
భార్య పేరు: పద్మలత
పిల్లలు: హరిప్రియాంక, సాయిశివప్రదీప్


