నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరి | Sakshi
Sakshi News home page

నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరి

Published Thu, May 9 2024 5:05 AM

నేటిత

నాల్గవ రోజు ప్రశాంతం

పార్వతీపురంటౌన్‌: సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ బుధవారం నాల్గవరోజు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పోలీసు సిబ్బంది, ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వినియోగించుకున్నారు. పార్వతీ పురం మన్యం జిల్లాలో ఓటు కలిగి ఉండి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు వారి సొంత నియోజకవర్గ కేంద్రాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పార్వతీపురంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు విని యోగించుకున్నారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని మరోరోజు పొడిగిస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్‌కుమార్‌ ప్రకటించారు. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు పార్వతీపురంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో, 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోస్ట ల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ చేసే వెసులు బాటు కల్పించిన ట్లు కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరి
1/2

నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరి

నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరి
2/2

నేటితో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరి

Advertisement
Advertisement