జాతీయ రెజ్లింగ్‌కు గురుకుల విద్యార్థులు | Sakshi
Sakshi News home page

జాతీయ రెజ్లింగ్‌కు గురుకుల విద్యార్థులు

Published Wed, Nov 15 2023 12:54 AM

బంగారు పతకాలు సాధించిన విద్యార్థులతో గురుకుల కళాశాల అధ్యాపకులు  
 - Sakshi

అచ్చంపేట: స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆంద్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి రెజ్లింగ్‌ (కుస్తీ) పోటీలకు అర్హత సాధించారు. ఎంపికై న విద్యార్థులను మంగళవారం కళాశాల అధ్యాపకులు అభినందించారు. విద్యార్థులకు తర్ఫీదునిచ్చిన ఫిజికల్‌ డైరెక్టర్‌ జి.భూషణం మాట్లాడుతూ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆద్వర్యంలో ఈనెల 11, 12, 13 తేదీలలో కృష్ణా జిల్లా నున్న గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూలు ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ (కుస్తీ) పోటీలలో తమ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. వారిలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు కె.కిరణ్‌కుమార్‌, జి.ఇసాక్‌, కె.ప్రభాకర్‌ బంగారు పతకాలు సాధించి జాతీయ రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరితో పాటు బి.మహేంద్ర రజిత పతకం సాధించగా, వి.చంటి, బి.సాగర్‌ మహేష్‌ కాంస్య పతకాలు సాధించినట్లు వివరించారు. బంగారు పతకాలు సాధించిన ముగ్గురు విద్యార్థులు త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో ప్రిన్సిపాల్‌ టి.అరుణ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, టి.జె.ఎస్‌.సంపత్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement