మహిళలపై హింస పెరిగింది | Sakshi
Sakshi News home page

మహిళలపై హింస పెరిగింది

Published Fri, May 26 2023 12:58 AM

- - Sakshi

ఖలీల్‌వాడి: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై హింస పెరిగిందని, వీటన్నిటిని అరికట్టాలంటే రానున్న కాలంలో మహిళలంతా ఏకమై ఐక్య పోరాటం చేయడం వల్లనే సాధ్యమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌ బాబు పేర్కొన్నారు. నగరంలోని సీపీఎం ఆఫీస్‌లో ఐద్వా మహిళా సంఘం విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. సమావేశంలో రమేశ్‌బాబు మాట్లాడుతూ.. మనువాద సిద్ధాంతం ప్రకారం మహిళలను వంటింటికే పరిమితం చేసి పిల్లల కనే యంత్రంగా భావించే ధోరణితో నాయకులు ఉన్నారన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా మహిళలందరూ పోరాటాలు చేయాలన్నారు. నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా అనిత, కార్యదర్శిగా బి.సుజాత, ఉపాధ్యక్షులుగా లావణ్య, బి.అనసూయ, సహాయ కార్యదర్శిగా షేక్‌ మీరా ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement