ట్రక్‌ను ఢీకొన్న కారు.. మంత్రి కుమార్తెతో సహా నలుగురు మృతి! | Jharkhand Minister’s Daughter Among Four Killed in Jamshedpur Car-Truck Crash | Sakshi
Sakshi News home page

ట్రక్‌ను ఢీకొన్న కారు.. మంత్రి కుమార్తెతో సహా నలుగురు మృతి!

Sep 24 2026 11:37 AM | Updated on Sep 24 2026 11:42 AM

Jharkhand Minister’s Daughter Among Four Killed in Jamshedpur Car-Truck Crash

జంషెడ్‌పూర్‌: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంషెడ్‌పూర్‌ జిల్లా డోముహానీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి కారు, ట్రక్‌ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్‌ కుమార్తె కూడా ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. డోముహానీ సమీపంలో ఆగి ఉన్న ట్రక్‌ను కారు ఢీకొన్నట్లు సమాచారం. అత్యంత వేగంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై జార్ఖండ్‌ ఆరోగ్య మంత్రి డాక్టర్‌ ఇర్ఫాన్‌ అన్సారీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. దీపికా పాండే సింగ్‌ కుమార్తె మృతిపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా దీపికా పాండే సింగ్‌ ప్రభుత్వం తరఫున విద్యార్థుల మద్దతుగా మాట్లాడారు. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని, ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌, టియర్‌ గ్యాస్‌, పెలెట్‌ గన్‌ వంటివి ఉపయోగించకూడదని ఆమె కోరారు. ఆగస్టు 17న రాంచీ సదర్‌ ఆసుపత్రిలో విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్‌ మహతో నిరాహార దీక్షను జ్యూస్‌ ఇచ్చి విరమింపజేశారు. ఈ సమయంలో ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్‌ అన్సారీ కూడా అక్కడ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement