అంగరంగ వైభవంగా వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు

Published Sat, Mar 23 2024 1:05 AM

- - Sakshi

బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి వారి 38 వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానాచార్యులు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, ప్రాతారాధన, అర్చన, సేవాకాలం, బాలభోగ నివేదన, హోమం, వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలర్మేల్‌మంగా గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అలంకారం, రాజభోగ నివేదన, తీర్థప్రసాద గోష్టి వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అనంత నర్సింహరెడ్డి, వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాపరెడ్డి, కూచుకుళ్ల శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, కొర్త చంద్రారెడ్డి, బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చక బృందం శాస్త్రోక్తంగా పూజలు, అర్చనలు, గోత్రనామార్చన పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు గర్భగుడి, దేవతామూర్తుల విగ్రహాల శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమలో ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజల్‌రావు, ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

మహిళల రక్షణకు

నిరంతరం కృషి

నాగర్‌కర్నూల్‌ క్రైం: మహిళల రక్షణకు పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందని జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్‌ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో షీటీం రెస్పాండెంట్స్‌కు ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో షీ టీమ్స్‌, పోలీసు అధికారులు మహిళ రక్షణపై పటిష్టంగా పని చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు సమస్యలు ఉంటే మానసిక ధైర్యం కలిగి ఉండాలని, అనుకూల, ప్రతికూల సమయాల్లో స్పందించేలా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతిఒక్కరూ ఇంటర్నెట్‌ను అవసరం ఉన్న మేరకే వినియోగించుకోవాలని సోషల్‌మీడియాలో వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌ ఖాతా వివరాలను ఇతరులకు చెప్పవద్దని తెలిపారు. సైబర్‌నేరగాళ్లు ఆశ చూపితే వారికి ఆకర్షితులు కావొద్దని, మెసేజ్‌లో వచ్చే బ్లూ లింక్‌ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని తెలియజేశారు. సైబర్‌ మోసాలపై 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు. మహిళలు, చిన్నారులు వేధింపులకు గురైతే షీ టీమ్‌ నెంబర్‌ 8712657676, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. కార్యక్రమంలో షీ టీం ఇన్‌చార్జ్‌ విజయలక్ష్మి ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్స్‌ వెంకటయ్య, పద్మ, కానిస్టేబుల్‌ వెంకట్‌ నాయక్‌ పాల్గొన్నారు.

ప్రతి కార్యకర్త శ్రమించాలి

వనపర్తిటౌన్‌: నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ గెలుపునకు ప్రతి బూత్‌ కమిటీ కార్యకర్త అహర్నిశలు శ్రమించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు వెంకటేష్‌ అధ్యక్షతన జరిగిన సన్నాహన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 24వ తేదీ ఆదివారం జరగబోయే జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ హాజరుకానున్నారని, ప్రతి బూత్‌ కమిటీ నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. వెంకటేశ్వర్‌రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement