తిమ్మరుసు ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన తారక్‌ | Watch: Jr NTR Released Satyadev Thimmarusu Movie Trailer | Sakshi
Sakshi News home page

Thimmarusu: తిమ్మరుసు ట్రైలర్‌ వచ్చేసింది..

Jul 26 2021 6:28 PM | Updated on Jul 26 2021 7:07 PM

Watch: Jr NTR Released Satyadev Thimmarusu Movie Trailer - Sakshi

తిమ్మరుసు సినిమా ట్రైలర్‌ను యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ రిలీజ్‌ చేశాడు. ఎవరైనా కేసు గెలిస్తే బైక్‌ నుంచి కారుకు వెళ్తారు కానీ రామ్‌ కారు నుంచి బైక్‌కు వచ్చాడు..

Thimmarusu Movie Trailer: 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ఆకట్టుకున్న సత్యదేవ్‌ తాజాగా నటించిన చిత్రం తిమ్మరుసు. అసైన్‌మెంట్‌ వాలి అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ రిలీజ్‌ చేశాడు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని తిమ్మరుసు లాంటి తెలివితేటలున్న లాయర్‌ రామచంద్ర పాత్రలో సత్యదేవ్‌ నటించాడు. 'ఎవరైనా కేసు గెలిస్తే బైక్‌ నుంచి కారుకు వెళ్తారు కానీ రామ్‌ కారు నుంచి బైక్‌కు వచ్చాడు' అన్న డైలాగ్‌ సత్యదేవ్‌ వ్యక్తిత్వాన్ని చెప్తోంది.

'నీ ముందున్నది వాలి అని మర్చిపోకు, ఎదురుగా ఉంటే సగం బలం లాగుతా లాయర్‌ రామచంద్ర.. నువ్వు సగం బలం లాక్కునే వాలివైతే నేను దండేసి దండించే రాముడిలాంటోడిని' అన్న డైలాగ్‌ హైలైట్‌గా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే ఒక క్యాబ్‌ డ్రైవర్‌ మర్డర్‌ కేసు చుట్టూ కథ అల్లుకున్నట్లు తెలుస్తోంది. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించారు.  ఈనెల 30న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement