Tweet War Between Anasuya Bharadwaj And Vijay Devarakonda Fans - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: అనసూయ, విజయ్‌ ఫ్యాన్స్‌ మధ్య ట్విటర్‌ వార్‌, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ

Aug 26 2022 6:13 PM | Updated on Aug 26 2022 7:06 PM

Tweet War Between Anasuya Bharadwaj And Vijay Devarakonda Fans - Sakshi

సోషల్‌ మీడియాలో తనని ట్రోల్‌ చేస్తున్న వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది యాంకర్‌ అనసూయ. జబర్దస్త్‌ షోను వీడినప్పటి నుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. నిన్న(గురువారం) అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ శాపనార్థలు పెడుతూ ఆమె చేసిన ట్వీట్‌పై విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయ్‌ని ఉద్దేశించే ఈ ట్వీట్‌ చేసిందని ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. దీంతో ఆమెను ఆంటీ అంటూ ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. దీంతో అనసూయకు-విజయ్‌ ఫ్యాన్స్‌కు మధ్య ట్విటర్‌ వార్‌ మొదలైంది. తనని విమర్శిస్తూ కామెంట్స్‌ చేస్తున్న ప్రతి ఫ్యాన్‌కు అనసూయ ఏమాత్రం తగ్గకుండా తనదైన స్టైల్లో వార్నింగ్‌ ఇస్తుంది.

చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు!

ఇక తనని, తన ఫ్యామిలీని ట్రోల్‌ చేస్తే చూస్తూ ఊరుకోనని, వారి ట్వీట్స్‌ను  స్క్రీన్‌ షాట్‌ తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఇక తనని ఆంటీ అని పిలుస్తూ అవమానిస్తున్నారడంతో ఓ నెటిజన్‌ ఆంటీ అనే పదాన్ని బూతుగా మార్చేశావ్‌గా అంటూ కామెంట్‌ చేశాడు. దీనికి ఆమె ‘నా పిల్లల ఫ్రెండ్స్‌ పిలవడంలో, మీరు పిలవడంలో తేడా ఉంది. మీరు పలిచే ఉద్దేశం వేరు’ అంటూ సమాధానం ఇచ్చింది. ఇలా తన ట్వీట్స్‌లో పెడర్థాలు తీస్తూ నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేయడం, వారి కామెంట్స్‌కు అనసూయ తిరిగి కౌంటర్‌ వేయడం ఇలా వరుస ట్వీట్స్‌ దర్శనం ఇచ్చాయి. దీంతో అనసూయ ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండ్‌ అవుతోంది. ఇక అనసూయ, విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ మధ్య ఈ ట్వీట్‌ వార్ ఎప్పటివరకు కొనసాగుతుందో, దీనికి ఎండ్‌ ఎప్పుడు పడుతోంది చూడాలి. 

చదవండి: సౌత్‌ సినిమాలపై అనుపమ్‌ ఖేర్‌ ప్రశంసలు, బాలీవుడ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement