Sunny Leone Lungi Dance Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sunny Leone: సన్నీ లియోన్‌ లుంగీ డ్యాన్స్‌ చూశారా?.. స్టెప్పులు అదిరాయిగా!

Dec 12 2021 5:13 PM | Updated on Dec 12 2021 8:23 PM

Sunny Leone Lungi Dance Video Goes Viral on Social Media - Sakshi

Sunny Leone Lungi Dance Viral Video: సన్నీ లియోన్‌ లుంగీ డ్యాన్స్‌ చూశారా? వీడియో వైరల్‌

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ సోషల్‌ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు. హాట్‌ హాట్‌ ఫోటోలతో పాటు బోల్డ్‌ వీడియోలను షేర్‌ చేస్తూ..కుర్రకారు మతులు పోగోడుతుంది. సన్నీలియోన్‌ ఒక్క ఫోటో షేర్‌ చేసిందంటే చాలు క్షణాల్లో లక్షల లైకులు వచ్చిచేరుతాయి.  ఆమెకు కేవలం బాలీవుడ్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ షేర్‌ చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

‘ఓ మై ఘోస్ట్’ సినిమాతో సన్నీ.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కోసం సన్నీ లుంగీ డ్యాన్స్‌ చేసింది. లుంగీ ధరించి మాస్‌బీట్‌కు అనుగుణంగా సన్నీ స్టెప్పులేదు. దీనికి సంబంధించి వీడియో క్లిప్‌ని సన్నీ లియోన్‌ తన ఇన్‌స్టా​ ఖాతాలో షేర్‌ చేయడం.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. సన్నీ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’ మూవీతో పాటు..  ‘వీరమాదేవి’, ‘రంగీలా’, ‘షెరో’, ‘కోకకోలా’, ‘హెలెన్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement