‘మండాడి’ తర్వాత సుహాస్‌ కొత్త సినిమా ఇదే | suhas new movie hide and silk title promo released | Sakshi
Sakshi News home page

‘మండాడి’ తర్వాత సుహాస్‌ కొత్త సినిమా ఇదే

Oct 12 2026 9:02 PM | Updated on Oct 12 2026 9:05 PM

suhas new movie hide and silk title promo released

మండాడితో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుహాస్‌ ప్రధాన పాత్రలో, రాజేంద్ర బాల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సంజనా కృష్ణమూర్తి కథానాయిక. కార్తికేయన్‌ సంతానం, వార్తికా జైన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ని ‘హైడ్‌ అండ్‌ సిల్క్‌’గా ఖరారు చేసింది చిత్రబృందం. ఈ మేరకు సోషల్‌ మీడిమాలో టైటిల్‌ ప్రోమోను విడుదల చేసింది. 

 సుహాస్-సంజన ప్రేమ చిగురించిందని తెలుపుతూ.. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో సుహాస్ సరసన సంజన కృష్ణమూర్తి హీరోయిన్‌గా నటిస్తున్నారు.  తనికెళ్ల భరణి, నందు కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాతోనే రాజేంద్ర బాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో త్వరలోనే విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: దసరా పూజలు.. ఫొటోలు షేర్‌ చేసిన దిల్‌రాజ్‌ భార్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement