ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Sudheer Babu’s Harom Hara Telugu OTT Release Date Out | Sakshi
Sakshi News home page

Harom Hara OTT: యాక్షన్ మూవీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?

Jul 8 2024 6:22 PM | Updated on Jul 8 2024 6:57 PM

Sudheer Babu Harom Hara OTT Release Date Latest

యాక్షన్ మూవీ లవర్స్ రెడీ అయిపోండి. ఎందుకంటే మరో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేశ్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హరోం హర'. కొన్ని రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లు కాకుండా మరో ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ డీటైల్స్ ఏంటి?

సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ సినిమా 'హరోం హర'. కుప్పం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లలోకి వచ్చింది. 'పుష్ప', 'కేజీఎఫ్' లాంటి చిత్రాలని పోలినట్లు ఉందని టాక్ వల్ల జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ డీల్ సెట్ అయిపోయింది.

(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?)

తొలుత ఈటీవీ విన్‪‌లో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అంటే ఈ వీకెండ్ ఏదైనా యాక్షన్ మూవీ చూస్తూ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.

అది 1980. కుప్పంలో ముగ్గురు రౌడీలు ఉంటారు. ఈ ఊరిలోనే కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు). ఓ సందర్భంలో రౌడీతో గొడవపడటం వల్ల ఉద్యోగం కోల్పోతాడు. అదే టైంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. దీంతో సొంతంగా తుపాకులు తయారు చేస్తాడు. సస్పెండ్ అయిన పళని స్వామి (సునీల్)తో కలిసి గన్స్ తయారు చేస్తాడు. పోలీసులు-రౌడీలు ఇతడు ఎందురు టార్గెట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!)

Advertisement
 
Advertisement
Advertisement