సింగర్‌ సునీత మెహందీ ఫంక్షన్‌ | Singer Sunitha Mehendi Function | Sakshi
Sakshi News home page

మొదలైన సునీత పెళ్లి సందడి

Jan 9 2021 4:10 PM | Updated on Jan 9 2021 5:48 PM

Singer Sunitha Mehendi Function - Sakshi

టాలీవుడ్‌ సింగర్‌ సునీత పెళ్ళి కూతురుగా ముస్తాబవుతోంది. బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో ఇదివరకే నిశ్చితార్థం జరగ్గా తాజాగా ఆమె ఇంట మెహందీ ఫంక్షన్‌ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్‌ శుక్రవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతో అభిమానులు సునీతకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పసుపు చీరలో మెరిసిపోతున్న సునీత ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫంక్షన్‌కు యాంకర్‌ సుమ కూడా హాజరయ్యారు (చదవండి: సంక్రాంతికి ముందే సింగర్‌ సునీత పెళ్లి!)

కాగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో సునీత-రామ్‌ ఓ స్పెషల్‌ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే! దీనికి టాలీవుడ్‌ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ కూడా హాజరయ్యారు. సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో సదరు హీరోనే దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. ఇక డిసెంబర్‌ 26న ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషనన్స్‌ ఏర్పాటు చేసినట్లు ఓ ఇన్విటేషన్‌ కార్డు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. కాగా సునీత వివాహం నేడే జరుగనుందని సమాచారం. (చదవండి: బాధపడ్డా.. కానీ పశ్చాత్తాపం లేదు: సోహైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement