Sai Dharam Tej : మెగా హీరో బర్త్‌డే స్పెషల్‌.. SDT15 పోస్టర్‌ విడుదల

Sai Dharam Tej Birthday Special SDT15 Poster Released - Sakshi

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం కార్తక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SD15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

నేడు(అక్టోబర్‌15)న సాయిధరమ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. భీమ్లానాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top