Sabyasachi Trolled For Picking Unhappy Models In Jewellery Ad - Sakshi
Sakshi News home page

Sabyasachi Designs: 'చావుకళ స్పష్టంగా కనిపిస్తుంది'..సబ్యసాచి డిజైన్స్‌పై ట్రోలింగ్‌

Nov 30 2021 12:49 PM | Updated on Nov 30 2021 5:40 PM

Sabyasachi Trolled For Picking Unhappy Models In Jewellery Ad - Sakshi

Sabyasachi Trolled For Picking Unhappy Models In Jewellery Ad: ఫ్యాషన్‌ రంగంలో సబ్యసాబి డిజైన్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్టార్‌ హీరోహీరోయిన్ల పెళ్లిళ్లు, ఫంక్షన్లు సహా మరే ఇతర వేడుకలో అయినా సభ్యసాచి డిజైన్స్‌ ఉండాల్సిందే అనేంతగా ఈ డిజైన్స్‌ ప్రాచుర్యం పొందాయి. అయితే ఇటీవలి కాలంలో సబ్యసాచి కలెక్షన్స్‌ నెటిజన్ల ట్రోలింగ్‌కి గురవుతున్నాయి. మొన్నటికి మెన్న మంగళసూత్ర యాడ్‌లో సెమీ న్యూడ్‌గా తీయించిన ఫోటోషూట్‌ తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి సబ్యసాచి డిజైన్స్‌ హెడ్‌ సబ్యసాచి ముఖర్జీ చేయించిన యాడ్‌పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. తాజాగా సబ్యసాచి డిజైన్స్‌ వింటర్‌ కలెక్షన్‌-2021 పేరిట కొత్త కలెక్షన్స్‌ రిలీజ్‌ చేశారు. దీనిలో భాగంగా మోడల్స్‌..సభ్యసాచి డిజైన్స్‌ ధరించి ఫోటోషూట్‌ చేశారు. జ్యువెలరీ చూడటానికి చాలా బాగున్నాయి కానీ వాటిని ధరించిన మోడల్స్‌ మొహంలో ఏమాత్రం చిరునువ్వు లేదు.

దీంతో ..ఎవరో చచ్చిపోయినట్లు ఆ మొహాలు ఏంటి? చావుకు వెళ్తున్నట్లు అలా ఉన్నారేంటి? అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. 'మోడల్స్‌​ ముఖంలో చావు కళ స్పష్టంగా కనిపిస్తుందని, అసలు వీళ్లు మోడల్సేనా' అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మోడల్స్‌ అంటే ఎక్స్‌ప్రెషన్‌ కనిపించకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఏడుపుగొట్టు ముఖాలు ఎందుకు పెట్టారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement