రామ్ చరణ్-ఉపాసనల ఫన్నీ వీడియో .. నెట్టింట వైరల్

Ram Charan And Upasana Funny Video Goes Viral - Sakshi

Ram Charan And Upasana Funny Video Goes Viral: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాధారణంగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇటీవల రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఈ సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారు. రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ తో వెకేషన్ కు వెళ్తున్నాను అంటూ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ వెకేషన్ లోని సరదా సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిన్ లాండ్ లో ఉపాసనతో రామ్ చరణ్ ఫన్నీగా గడిపిన సన్నివేశాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం ఫన్నీగా ఉంది. అంతేకాకుండా ఈ జంట ఫిన్ లాండ్ లో చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క పక్కన మంచులో రామ్ చరణ్ పడుకోవడం సరదాగా ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో చూడండి. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top