నయన్‌కు సర్‌ప్రైజ్‌: విక్కీ బర్త్‌డే బ్యాష్‌ మామూలుగా లేదుగా | Nayanthara Birthday Fiance Vignesh Shivan surprises her lavish bash | Sakshi
Sakshi News home page

VikkyNayan: విక్కీ సర్‌ప్రైజ్‌, బర్త్‌డే బ్యాష్‌ మామూలుగా లేదుగా

Nov 18 2021 10:07 AM | Updated on Nov 18 2021 9:04 PM

Nayanthara Birthday Fiance Vignesh Shivan surprises her lavish bash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లేడీ సూపర్‌స్టార్‌ అంటూ ఫ్యాన్స్‌తో నీరాజనాలు అందుకుంటున్న స్టార్‌ హీరోయిన్‌ నయనతార ఈ రోజు (నవంబరు18) 37వ పుట్టినరోజును జరుపు కుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు కాబోయే భర్త , దర్శకుడు విఘ్నేష్ శివన్ నయన్‌ పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు.  స్పెషల్‌ పార్టీతో తన లేడీ లవ్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. బాణాసంచా ఆకాశమంతా వెలిగిపోయింది.

అర్థర్రాతి నుంచే  చెన్నైలో నయనతారకు బర్త్‌డే సంబరాలు షురూ అయ్యాయి. సరిగ్గా  గడియారం 12 కొట్టంగానే విక్కీ నయన్‌తో  కేక కట్‌ చేయించి క్రాకర్స్‌ పేల్చి సందడి చేశాడు. ఈ పార్టీకి విక్కి, నయన్‌ కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. మరోవైపు తమ అభిమాన హీరోయిన్‌కు ఫ్యాన్స్‌తో పాటు, పలువురు ప్రముఖులు కూడా నయనతారకు  బర్త్‌డే విషెస్‌ అందిస్తున్నారు.

కాగా విఘ్నేష్ శివన్, నయనతార ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ ఫంక్షన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ  లవ్‌బర్డ్స్‌  పెళ్లి పీటలెక్కే ముహూర్తాన్ని  ఇంకా ప్రకటించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement