Nagarjuna The Ghost Movie: Jacqueline Fernandez To replace Kajal Aggarwal In Nagarjuna Ghost Movie - Sakshi
Sakshi News home page

Jacqueline Fernandez: కాజల్‌ స్థానంలో జాక్వెలిన్‌!.. ప్రెగ్నెన్సీనే కారణమా?

Sep 26 2021 7:24 AM | Updated on Sep 26 2021 9:56 AM

Jacqueline Fernandez to replace Kajal Aggarwal In Nagarjuna Ghost - Sakshi

Jacqueline To Replace Pregnant Kajal Aggarwal:  ‘విశేషం ఏమైనా ఉందా?’... పెళ్లయిన అమ్మాయిలను చాలామంది అడిగే ప్రశ్న ఇది. తల్లి కాబోతున్నావా? అనే విషయాన్ని ఇలా అడుగుతుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ ఏదైనా విశేషాన్ని స్వయంగా చెబుతారేమోనని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాజల్‌ పెదవి విప్పడంలేదు కానీ ఆమె గర్భవతి అనే వార్త మాత్రం ప్రచారంలోకొచ్చింది.

చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్‌..ధర తెలిస్తే షాకే

గత ఏడాది వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కానున్నారనీ, ఆల్రెడీ సెట్స్‌ మీద ఉన్న చిత్రాలను పూర్తి చేయాలనుకుంటున్నారనీ, సైన్‌ చేసి.. ఇంకా సెట్స్‌కి వెళ్లని సినిమాల నుంచి మాత్రం తప్పుకుంటున్నారనీ టాక్‌. అలా తప్పుకుంటున్న సినిమాల్లో నాగార్జున సరసన అంగీకరించిన ‘ది ఘోస్ట్‌’ ఒకటని చెప్పుకుంటున్నారు.

ఆమె స్థానంలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ని తీసుకున్నారట. ‘సాహో’లో ప్రభాస్‌తో ‘బ్యాడ్‌ బాయ్‌’ ఐటమ్‌ సాంగ్‌కు జాక్వెలిన్‌ కాలు కదిపారు. మరి.. తెలుగు తెరపై కథానాయికగా కూడా ఆమె కనిపిస్తారా అంటే.. కాజల్‌ విశేషం నిజమే అయ్యుంటే, ‘ఘోస్ట్‌’ యూనిట్‌ జాక్వెలిన్‌ని తీసుకుని ఉంటే నిజమే అవుతుంది. 

చదవండి : దయచేసి అందరూ హెల్మెట్‌ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్‌ తేజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement