Hrithik Roshan And Saba Azad Planned To Move An Apartment, Worth 100 Crore Rupees - Sakshi
Sakshi News home page

Hrithik Roshan And Saba Azad: లవర్‌ కోసం రూ.వంద కోట్ల ప్యాలెస్.. హృతిక్ రోషన్ భారీ ఖర్చు..!

Nov 19 2022 3:03 PM | Updated on Nov 19 2022 4:08 PM

Hrithik Roshan And Saba Azad Planned To Move An Apartment worth100 crore Rupees - Sakshi

బాలీవుడ్‌ స్టార్ నటుడు హృతిక్‌ రోషన్‌ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్‌ స్టార్‌ రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. కొంత కాలంగా అతని స్నేహితురాలు, సింగర్ సబా ఆజాద్‌తో రిలేషన్ కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆ మూడు అంతస్తుల భవనాల్లోకి మారునున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. 

(చదవంండి: హృతిక్ రోషన్ స్టెప్పులు అదుర్స్.. విక్రమ్ వేద వీడియో సాంగ్ రిలీజ్)

హృతిక్‌ రోషన్‌ 2014లో తన సతీమణి సుజేన్‌ ఖాన్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సబా ఆజాద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ జంట ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముంబైలో డిన్నర్ డేట్ తర్వాత మొదటిసారి కనిపించిన ఈ జంట.. అప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. రోషన్ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్‌లో సబా పాల్గొనటం, పార్టీల్లో ఇద్దరు చేతులు పట్టుకుని కనిపించడంతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

హృతిక్ చివరిసారిగా ఇటీవల విడుదలైన విక్రమ్ వేదలో కనిపించారు. మాధవన్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్‌ హిట్‌ ‘విక్రమ్‌ వేద’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది. పుస్కర్‌, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  విక్రమ్ వేద బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్, యోగితా బిహానీ, షరీబ్ హష్మీలతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు. మరోవైపు సబా తదుపరి చిత్రంలో నమిత్ దాస్, గీతాంజలి కులకర్ణితో కలిసి నటించనుంది. ఈ సినిమాలో ఆమె ఫ్రెంచ్ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం సాంగ్ ఆఫ్ ప్యారడైజ్ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement