Dilip Kumar: ఆద్యుడు.. ఆయనొక విశ్వవిద్యాలయం

Condolences  to Legend Dilip Kumar:Indian Cinema and will forever be remembered  - Sakshi

సినీ ప్రపంచం గొప్ప నటుడుని కోల్పోయింది:  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భారతీయ సినీ చరిత్రను దిలీప్‌ కుమార్‌కు ముందు.. తరువాత  అని రాయాలి : అమితాబ్‌

ఆయన అభినయం  ఒక విశ్వవిద్యాలయం : అరవింద్‌ కేజ్రీవాల్‌ 

సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు దిలీప్ కుమార్ అస్తమయంపై సినీ సెలబ్రిటీలతోపాటు, పలువురు రాజకీయ రంగ ప్రముఖులు, ఇతర నేతలు కూడా  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన ఆద్యుడు అంటూ కొనియాడారు. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం సినీరంగంలో చిరస్థాయిగా నిలిచి పోతుందంటూ దిలీప్‌ కుమార్‌కు  ఘన నివాళులర్పించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినిమా లెజెండ్‌గా దిలీప్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారనిపేర్కొన్నారు. ‘అసమాన తేజస్సు ఆయన సొంతం..అందుకే ప్రేక్షకులు ఆయనను చూసి మంత్రముగ్ధులవుతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని’ మోదీ ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ రాజ్యసభ సభ్యుడు దిలీప్‌ నిష్క్రమణపై సంతాపం తెలిపారు. సినీ ప్రపంచం ఒక గొప్ప నటుడుని కోల్పోయిందంటూ  వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా దిలీప్ కుమార్‌ మృతిపై సంతాపం వెలిబుచ్చారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసాధారణ సేవలు రానున్న తరాలకు  కూడా గుర్తుండి పోతాయన్నారు. ఈ సందర్భంగా దిలీప్‌ కుమార్‌ కుటుంబానికి, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 

బాలీవుడ్‌లో ఒక అధ్యాయం ముగిసిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిలీప్‌ కుమార్‌ మృతిపై సంతాపం తెలిపారు. యూసుఫ్‌​ సాబ్‌ అద్భుతమైన నటనా కౌశలం ప్రపంచంలో ఒక విశ్వవిద్యాలయంలా నిలిచిపోతుందన్నారు. ఆయన మనందరి హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సీఎం ట్వీట్‌ చేశారు. భారతీయ సినిమాకు లెజెండ్‌ దిలీప్‌ కుమార్‌ ఆద్యుడు. ఆయన ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారని మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నివాళులర్పించారు. భారతీయ సినీ చరిత్రను లిఖిస్తే.. దిలీప్‌ కుమార్‌కు ముందు, దిలీప్‌ కుమార్‌కు తరువాత అని పేర్కొనాల్సి వస్తుందని బాలీవుడ్‌ మరో సీనియర్‌  స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తన సహ నటుడు దిలీప్‌ కుమార్‌ను  గుర్తు చేసుకున్నారు.

కాగా పాకిస్థాన్‌లోని పెషావ‌ర్‌లో 1922 డిసెంబ‌ర్ 11న జన్మించిన దిలీప్‌ కుమార్‌ అసలు పేరు యూసుఫ్ ఖాన్. అయితే ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి వస్తున్న సమయంలో  చాలామంది లాగే ఆయన కూడా త‌న పేరును మార్చుకున్నారు. 1944 తన తొలి సినిమా జ్వ‌ర్ భాటా నిర్మాత  దేవికా రాణి సూచన మేరకు యూసుఫ్ ఖాన్‌ తన పేరును దిలీప్‌ కుమార్‌గా మార్చుకున్నారు. రొమాంటిక్‌ హీరోగా ప్రఖ్యాతి గాంచిన ఆయన మ‌ధుమ‌తి, దేవ‌దాస్‌, మొఘ‌ల్ ఏ ఆజ‌మ్‌, గంగా జ‌మునా, రామ్ ఔర్ శ్యామ్‌, క‌ర్మ లాంటి ఎన్నో ప్రసిద్ధ సినిమాల్లో తన నటనతో అజరామరంగా నిలిచిపోయారు.

Election 2024

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top