జీవితంలో గుర్తుంచుకోదగిన రోజు ఇది: తమన్‌

Chiranjeevi Starts Lucifer Remake Movie Shooting - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించనున్న 153వ చిత్రం షూటింగ్‌ ఈ రోజు ప్రారంభం కానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ సంస్థలపై ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలోని మొదటి పాట రికార్డింగ్‌ కూడా ఇటీవల పూర్తయింది. ఈ విషయాన్ని తమన్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు చిరంజీవి, మోహన్‌ రాజాలతో దిగిన ఫొటోను తమన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ..  ‘జీవితంలో గుర్తుంచుకోదగిని రోజు ఇది. చిరు 153 సినిమా కోసం పాట పూర్తి చేశాం. ఓ వీరాభిమానిగా చిరంజీవిగారి అభినందనలు అందుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. కాగా చిరంజీవి ఇటీవల ఆచార్య షూటింగ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top