చిరు బర్త్‌డే : ప్రముఖుల శుభాకాంక్షలు

Chiranjeevi Birthday: Tollywood Heros Wish Megastar Happy Birthday - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు నేడు(ఆగస్ట్‌ 22). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్  ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’  అని డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. 
 

మన వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పట్ల నాకు ఎల్లప్పుడూ గౌరవం, కృతజ్ఞత ఉంటాయి. ఆయనే నా నిజమైన ఆచార్యుడు' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. 

 

తన 'ఆచార్య' చిరంజీవేనంటూ వరుణ్ తేజ్‌ కూడా ట్వీట్ చేశాడు. 'హ్యాపీబర్త్ డే చిరంజీవి గారు' అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే చిరంజీవిగారు. నేటి తరానికి మీరు ఆదర్శం. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి’ అని మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. చిరు నా బెస్ట్ ఫ్రెండ్‌.. ఆయన ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటాను. హ్యాపీ బర్త్ డే చిరంజీవి' అని సీనియర్ నటి రాధిక పేర్కొన్నారు. ‘వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సినీనటుడు సునీల్ ట్వీట్ చేశాడు.
 

'మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ కెరీర్‌లో మరిన్ని గొప్ప మైలురాళ్లు అందుకోవాలని ఆశిస్తున్నాను' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top