కాళ్లకు చెప్పుల్లేని కడు పేదరికం నుంచి నటిగా.. | Bigg Boss Telugu 7: Shobha Shetty Entered as 8th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ఎనిమిదో కంటెస్టెంట్‌గా కార్తీక దీపం మోనిత

Sep 3 2023 8:47 PM | Updated on Dec 11 2023 12:33 PM

Bigg Boss Telugu 7: Shobha Shetty Entered as 8th Contestant - Sakshi

శోభా శెట్టి అంటే గుర్తుపడతారో లేదో కానీ కార్తీకదీపం మోనిత అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. డాక్టర్‌బాబును దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నిన అందమైన విలనే మోనిత అలియాస్‌ శోభా శెట్టి. ఈమె స్వస్థలం కర్ణాటక అయినా అచ్చ తెలుగింటి అమ్మాయిగా సీరియల్‌లో నటించి విశేష అభిమానులను దక్కించుకుంది. ఇంత పాపులారిటీ ఉన్న చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది.

ఇంటి నుంచి స్కూలుకు వెళ్లాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదట! ఈ క్రమంలో తన చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేక సేఫ్టీ పిన్‌ సాయంతో దాన్ని నెట్టుకొచ్చేదట. కొన్నిసార్లయితే కాళ్లకు చెప్పులు లేకుండానే స్కూలుకు నడిచి వెళ్లింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కన్నడలో అంజనీపుత్ర సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తెలుగు సీరియల్‌లో మోనిత పాత్రతో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువైంది. మరి బిగ్‌బాస్‌ షోతో వారి మనసులు కూడా దోచుకుంటుందేమో చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement