Bigg Boss 5 Telugu: Nagarjuna Try To Relief Contestants With Fun Tasks - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: అబ్బే, సీక్రెట్ రూమ్ వ‌ర్క‌వుట్ కాలే అంటున్న నెటిజ‌న్లు!

Oct 17 2021 4:49 PM | Updated on Oct 17 2021 6:03 PM

Bigg Boss 5 Telugu: Nagarjuna Try To Relief Contestants With Fun Tasks - Sakshi

సీక్రెట్ రూమ్‌లో లోబో తిన్నామా, ప‌డుకున్నామా, తెల్లారిందా అన్న‌ట్లుగా ఉంటున్నాడు, షో చాలా చ‌ప్ప‌గా సాగుతుంది, లోబోకి సీక్రెట్ రూమ్ వేస్ట్ అనిపిస్తోంది..

Bigg Boss Telugu 5 Promo: స‌డ‌న్ ఎలిమినేష‌న్‌తో షాక్‌లో ఉన్నారు హౌస్‌మేట్స్‌. లోబో ఎలిమినేట్ అవ‌డాన్ని చాలామంది జీర్ణించుకోలేక‌పోయారు. ముఖ్యంగా విశ్వ ఏక‌ధాటిగా ఏడుస్తుంటే ర‌వి త‌న క‌ళ్ల‌ను తానే న‌మ్మ‌లేక‌పోయాడు. లోబోది ఫేక్ ఎలిమినేష‌న్ అన్న విష‌యం కంటెస్టెంట్ల‌కు త‌ప్ప మ‌నంద‌రికీ తెలిసిందే! దీంతో వారిని షాక్‌లో నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశాడు నాగ్‌. అందులో భాగంగా నాగ్ వారితో స‌ర‌దాగా ఆట‌లాడించాడు.

ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోతో మాట్లాడిన నాగ్‌.. త‌నిచ్చిన డ్రెస్ వేసుకోలేద‌ని ప్ర‌శ్నించాడు. నాలుక్క‌రుచుకున్న లోబో వెంట‌నే డ్రెస్ వేసుకున్నాడు. ఇక్క‌డే సీక్రెట్ రూమ్‌లో ఉంటాన‌న‌డంతో నాగ్ న‌వ్వాపుకోలేక‌పోయాడు. ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు బిగ్‌బాస్ లోబోను సీక్రెట్ రూమ్‌కు పంపించి పెద్ద త‌ప్పు చేశాడ‌ని కామెంట్లు చేస్తున్నారు. 'శ్రీరామ్‌, స‌న్నీ... వీళ్లిద్ద‌రిలో ఎవ‌రిని సీక్రెట్ రూమ్‌కు పంపించినా క‌థ వేరే ఉండేద‌ని, ఈ సీజ‌న్‌లో సీక్రెట్ రూమ్ ఉండి కూడా వేస్టే' అంటున్నారు. 

'సీక్రెట్ రూమ్‌లో లోబో తిన్నామా, ప‌డుకున్నామా, తెల్లారిందా అన్న‌ట్లుగా ఉంటున్నాడు', 'షో చాలా చ‌ప్ప‌గా సాగుతుంది, లోబోకి సీక్రెట్ రూమ్ వేస్ట్ అనిపిస్తోంది', 'అత‌డు సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నాడ‌ని విశ్వ కు త‌ప్ప మిగ‌తా అంద‌రికీ తెలిసిన‌ట్లుంది', 'మిగ‌తా సీజ‌న్ల‌తో పోలిస్తే ఈసారి పెద్ద‌గా కామెడీ లేదు, బంధాలు, అనుబంధాలు, స్నేహం, గేమ్‌.. ఇవేవీ క‌నిపించ‌డం లేదు' అని పెద‌వి విరుస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement