Hansika Motwani, Sohael Khaturiya celebrate their pre-wedding ceremony in Mumbai - Sakshi
Sakshi News home page

Hansika Motwani and Sohael Khaturiya: ప్రత్యేక పూజలో హన్సిక-సోహైల్.. !

Nov 23 2022 3:00 PM | Updated on Nov 23 2022 3:23 PM

ansika Motwani and Sohael Khaturiya first pre wedding ceremony in Mumbai - Sakshi

హీరోయిన్‌ హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆమె సోహైల్‌ కతూరియా అనే వ్యాపారవేత్తతో డిసెంబర్‌ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్తాన్‌లోని  జైపూర్‌లోని ప్రాచీన ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. ఇప్పటికే హన్సిక పెళ్లిసందడి మొదలైంది. వివాహ వేడుకలో భాగంగా జరిగే'మాతా కీ చౌకీ' ముంబైలో నటి నివాసంలో ఘనంగా నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో కాబోయే వధూవరులిద్దరూ దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. 

(చదవండి: హన్సిక మ్యారేజ్ అప్‌ డేట్.. పెళ్లికూతురి చీరలో సందడి చేసిన భామ..!)

హన్సిక, సోహైల్‌ కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ జంట వ్యాపారంలోనూ  భాగస్వాములుగా ఉన్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న జంట పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్‌ 4న వీరి వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. మరోవైపు సోహైల్‌కు గతంలోనే హన్సిక స్నేహితురాలు రింకీని వివాహం చేసుకోగా.. కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement